Posts

Showing posts from December, 2019

కవి కలం.......

Image
కలం ఎప్పుడు కూడా ఏదో రకంగా బలి అవుతూనే ఉంటుంది..... కానీ నా కలం ఎప్పుడు దిక్కరిస్తూనే ఉంటుంది.... అధికార వ్యవస్థలో ఎన్నో రకాలుగా బలి అయ్యేది కవి కలమే..... కవి ఎప్పుడైతే లొంగిపోతాడో సమాజానికి చాలా చెడు జరిగే ప్రమాదమే ఉంది.... ఈరోజు కొందర్ని చూస్తున్నాం అలా.... వారి వల్లే నిజాయితీ గల సామాజిక స్పృహ ఉన్న ఎందరో మేధావి వర్గం గురి అవుతుంది.... తోత్తుల్ల పనిచేసే కవులు ఉన్నంత వరకు పాలక వర్గం యజమాయిషి చేస్తూనే ఉంటుంది..... కవి ఎప్పుడైతే ప్రశ్నించే తత్వాన్ని అమ్ముకోడో అప్పుడే నవ సమాజ నిర్మాణం జరగడంలో భాగం అవుతాడు..... అందుకే అంటాను పేరు నిలిచిపోయేలా మీ మాటల తూటాలను లిఖించండి..... ఈ భూమి నుండి పోయేది కేవలం నీ దేహం మాత్రమే కానీ నీ పేరు కాదు..... శాశ్వత చిరునామా కోసం మీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా మార్చుకోండి..... ఇట్లు మీ...... నవీన్ రెడ్డి అభ్యుదయ కవి

బతుకు-అమ్మ......

Image
బతుకమ్మ...  బతుకునిచ్చే అమ్మ... బతికించే అమ్మ...  బతికే అమ్మ. ఆడపిల్ల అంటే తనకుతాను బతకడమే కాదు, మరొకరికి బతుకునిస్తుంది.  ప్రకృతిలో చెట్టూ, పుట్టా,రాయి,రప్పా,పువ్వూ, కాయ,నీరు,గాలి... ఎంత సహజంగా వచ్చాయో.... ఆడ,మగ కూడా అంతే సహజంగా పుట్టారు.  ఈ ప్రపంచంలో పునరుత్పత్తి చేయగల శక్తి ఒక్క స్ర్తీ జాతికే ఉంది.  అది చెట్టు అయిన సరే, మరో ప్రాణి అయినా సరే. చెట్టు నుండి పూలు, కాయలు వచ్చి ఆ జాతి విస్తరించినట్లు,  ఆడజీవి కూడా మరో ప్రాణికి జన్మనిచ్చి సంతతిని వృద్ధి చేస్తుంది. బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులే కాదు, సంవత్సరం మొత్తం బతుకమ్మ ఆటలా ఆడపిల్ల జీవితం సాగాలి. ఆనందంగా,నిర్భయంగా ఉండగలగాలి.  నేను ఆడపిల్లని  అని గర్వంగా చెప్పుకునే స్థాయి కి ఎదగాలి. అలాంటి మంచి రోజులు రావాలి.  అందరూ బతుకు అమ్మ  అని స్త్రీ ని గౌరవించాలి....... చివరిగా నా మాటగా మన భూమాత పై ఆడపిల్లని  పుట్టనిద్దాం, బతకనిద్దాం,చదవనిద్దాం,ఎదగనిద్దాం, ముఖ్యంగా గౌరవిద్దాo..! మీ... నవీన్ రెడ్డి అభ్యుదయ కవి

సమాజం కోసం

Image
             మంచి అనేది మిగులుతుంది మన ఈ జీవితంలో సాధించేది ఏదైనా ఉంది అంటే అదొక మంచి పేరు మాత్రమే..... పేరుపోయెలా బతికితే చరిత్రలో నీకంటూ ఒక పేజి ఉండదు అలా ఉండకపోతే నీ జన్మకు అర్థమే లేదు కుక్కలు పందులు కూడా బతుకుతున్నయ్ కానీ మనం మనుషులం..... స్వల్ప కాలిక ఆనందాలు, అవకాశాలు కాదు మనకు ఇప్పుడున్న పరిస్థితి ని చూసి విర్రవీగే మనస్తత్వం కాదు మనకు కావల్సింది..... ఆత్మ పరిశీలన అవసరం..... నువ్వేంటి అనేది నీకన్న ఎవరికి ఎక్కువ తెలియదు..... చరిత్ర హీనుడు గా బతుకుతావో లేక ఈ చరిత్ర ఉన్నంత వరకు బతుకుతావో నిర్ణయం నీ చేతుల్లోనే....... వీలైతే మంచి ని మంచి అనండి మీ పెద్దరికాన్ని మేము పెద్దగా గౌరవంగా చెప్పుకునేలా.... ఎవరు ఎప్పుడు పోతారో తెలియదు.... అశాశ్వతమైన ఈ శరీరానికి అంతులేని అర్దం లేని ఎన్నో రకాల కుట్రలు కుతంత్రాలతో సమయం గడుపుతున్న కుల్లు మనుషులు ఎందరో..... నిన్న నేడు రేపు అనేదే మన చేతుల్లో లేదు ఇంకా దేనికి మానవ నీ అడుగుల ఎత్తులో పై ఎత్తు పరంపరలో నీ అర్ధం లేని నిర్ణయాలు..... గొప్పగా బతకడం అంటే  అదేదో కాదు మనిషి నువ్వు లేనప్పుడు నిన్ను మంచిగా తలుచుకోవ...

స్వల్ప కాలిక పరిస్థితులు కాదు.....

Image
స్వల్ప కాలిక పరిస్థితులు కాదు మనకు కావల్సింది... వ్యవస్థలో మన వ్యక్తిత్వం గురించి మాట్లాడుకోవాలి.... వక్ర భాశ్యలు కాదు మంచి మాటలు కావాలి.... కొన్ని రోజుల ఈ జీవితానికి ఏదో ఒక రోజు మరణంతో ముగిసి పోయే ఈ శరీరం ఎన్నో కుట్రలు కుతంత్రాలతో  మంచిపై చెడుని రాజ్యమేలుతున్న మ్ అనుకుంటే అది పొరపాటే.... మంచి అనేది ఎప్పటికీ మంచే...... సమాజహితం కోసం పెద్ద మనిషి హోదా ఉండాలి కానీ స్వంత లాభం కోసం కాదు...... పేరు పోయాక ఎలా బతికిన ఒక్కటే.... పేరు కోసం బతుకండి..... మనం సచ్ఛాక మనగురించి మంచిగా చర్చించాలి కానీ చెడుగా కాదు.....  జన్మ రహస్యం తెలుసుకోని ఒక యోదుడిల ఒక యోగ్యుడిగా బతుకు..... చరిత్రలో పేరు లిఖించేలా ఉండాలి మన వ్యక్తిత్వం.... అభ్యుదయ కవి కళ్లెం నవీన్ రెడ్డి కె ఎన్ ఆర్ 9963691692

అవును నేను ద్రోహినే.....

Image
నా మాట నీకు రుచించదు నా తీరు అస్సలు సహించదు ఏవో ఊకదంపుడు పలుకులంటావు వల్లమాలిన చేష్టలంటూ కొట్టిపారేస్తావు బతకడం చేతకాదంటూ తిట్టిపోస్తావు పైగా "లౌక్యం" తెలియన్నోనంటూ జాలి చూపుల విసురుతావు నీలానే ఉండాలనుకుంటా! కానీ అదేంటో.. చూపుల్లో ఏదో వెతుకులాట అంతరంగంలో దేనికో పెనుగులాట ఇంకేదో మారాలని మనసు మాట వెరసి నాది అదే(పోరు)బాట వ్యవస్థీకృత దాష్టికాలపై నా "ఉద్యమ" ప్రస్థానం మళ్లీ షురూ... అవే నిప్పులాంటి రాతలు అవే నిగ్గదీయు ప్రశ్నలు అవే దిక్కరించు మాటలు పాలకులు నిషేధితున్నంటు తేల్చేస్తారు ఇంకేం? ఆంక్షలు "నోళ్లు" తెరుస్తాయి సంకెళ్లు "ఒళ్ళు" విరుస్తాయ్ నిషేధాజ్ఞలు చుట్టుముడుతాయి చీకటి చెరసాలలు "బంధీ" చేస్తాయి సామ్రాజ్యవాదుల పాలనలో నీలా... బతుకు "తాకట్టు" పెట్టి "ఊ" కొట్టే ప్రతివాడు ఓ దేశ భక్తుడు నాలా... హక్కులకై నిక్కచ్చిగా నిలబడి కలబడే వాడెప్పుడు.... ఓ  ద్రోహుడు అవును! నేనిప్పుడు ద్రోహినే... -మీ నవీన్ రెడ్డి అభ్యుదయ కవి +91-9963691692

నువ్వు చేరలేని తీరాన్ని నేను

Image
నాపై మాటల తూటాలు విసురుదామని చూస్తున్నారేమో, ఇనుపకవచం కన్నా జఠిలమైనది నా మనోబలం. వెనుతిరిగి నేలరాలాల్సిందే మీ సమయం. కథలల్లి కాలక్షేపం చేస్తున్నారేమో, రవ్వంతైనా నా మోమున చిరునవ్వును చెరపలేదు మీ ప్రతిఫలం. నా ప్రపంచం నిత్యవాసంతపు విరివనం. నిత్యం ఎన్నో పదాల మాలలల్లుకుంటాను., ఆ పరిమళాలను ఆఘ్రాణిస్తూ పరవశమౌతాను. నా నిత్యజీవనం సమస్యల వెంట పయనం... అలల ఊయలపై కదలాడే ఆశల సరాగం. ఇక నా గమ్యం, మీరు సాగించలేని పయనం, మీరు ఎన్నటికీ చేరలేని తీరం. నవీన్ రెడ్డి అభ్యుదయ కవి +91-9963691692

ఉన్నతమైన వ్యక్తిత్వం

 ఈ సమాజంలో  మనయొక్క మాటలు  మనయొక్క రాతలు  మనల్ని నలుగురుకి పరిచయం  మాత్రమే చేస్తాయి  కానీ .. మనన " ఉన్నతమైన వ్యక్తిత్వం" మాత్రమే మనకు అందరు దగ్గరయ్యేలా దూరం కాకుండా చేస్తుంది... వ్య క్తిత్వం నిలబెట్టుకోవడం  అంత సులువైన పనేమీ కాదు. బయటశక్తులు మనల్ని మనలా  ఉండనివ్వవు కదా నవీన్ రెడ్డి కె. ఎన్.ఆర్   అభ్యుదయ కవి   +91-9963691692

సచ్చిపో తున్నాం అని తెలిసి కూడా బతుకుతున్నాం....

సచ్చిపోతున్నాం అని తెలిసి కూడా బతుకుతున్నాం.... అయితే ఎందుకు బతుకుతున్నాం అనేది ఆత్మ పరిశీలన అవసరం.... మరణించడం జన్మించడం అనేది ఒక క్షణిక పాటు నిర్ణయం  కానీ జీవించడం అనేది మాత్రం అంతా సులభం ఏమి కాదు..... నది పాతదే అయిన అది పారె ప్రతి క్షణం నూతనమే... ఆకాశం పాతదే అయిన దాని ఆంతర్యం రోజు కొత్తదే... అలాగే మనిషి జీవనం కూడా..... సృష్టిలో నీ జననం ఒక మహత్తర కార్యానికై ఉందని గ్రహించు..... నీ జననం ఎవరికి తెలియకపోవచ్చు కానీ నీ మరణం మాత్రం ఈ భూ సమస్తానికి తెలియాలి.... నవీన్ రెడ్డి.... కె ఎన్ ఆర్ అభ్యుదయ కవి +91-9963691692

నటన జీవితం

నటన జీవితం నటనతోనే మనిషి  జీవితం మొదలు అబద్ధమైన చిరునవ్వు పెదవులపై స్వార్థపూరితమైన అభిమానం అంధకారంలో బ్రతుకులు ఆవేశంలో  దహించుకుపోతున్న జీవితాలు ...... రోజుకో నాటకం మనిషి మనసుతో మాయల  మాటలు జీవితమనే  ఈ రంగస్థలంలో ఎవరిని నమ్మాలో  తెలియక ఎవరిని అడగాలో తెలియక నిజమైన ఆప్యాయత ఎక్కడ ఉందా అని మనసులో అనుక్షణం ఓ జవాబు తెలియని ప్రశ్నగా మిగిలిపోతున్నది ..... ఆశలకు అర్థమే మరిచి ఆత్మగౌరమంటే విలువ చెరచి ఊహలకు రూపం ఇస్తారు హృదయాల మధ్య అనర్థాలు  ఎక్కువ చేసి ఆలోచనలన్నీ అణిచేస్తూ ప్రాణం ఎక్కడో  అటు ఇటు ఊసులాడే దేహమేమో జీవమే లేక  ఇక్కడ క్షణక్షణం రంగులు మార్చే ఊసరవిల్లులే  చుట్టూ  చేరి అన్యాయాలకు అందమైన  రంగును పులిమి తోడుగా  నిలుస్తుంటే భరించలేక బాధపడుతుంటే  ..... మోసం  చేస్తూ  నటించలేక ఈ నాటకరంగంలో  నటించలేక ఏంటో యీ జీవితం @Knr's lines @Copy rights reserved +91-9963691692