అవును నేను ద్రోహినే.....


నా మాట నీకు రుచించదు
నా తీరు అస్సలు సహించదు
ఏవో ఊకదంపుడు పలుకులంటావు
వల్లమాలిన చేష్టలంటూ కొట్టిపారేస్తావు
బతకడం చేతకాదంటూ తిట్టిపోస్తావు
పైగా "లౌక్యం" తెలియన్నోనంటూ
జాలి చూపుల విసురుతావు

నీలానే ఉండాలనుకుంటా!
కానీ అదేంటో..
చూపుల్లో ఏదో వెతుకులాట
అంతరంగంలో దేనికో పెనుగులాట
ఇంకేదో మారాలని మనసు మాట
వెరసి నాది అదే(పోరు)బాట

వ్యవస్థీకృత దాష్టికాలపై
నా "ఉద్యమ" ప్రస్థానం మళ్లీ షురూ...

అవే నిప్పులాంటి రాతలు
అవే నిగ్గదీయు ప్రశ్నలు
అవే దిక్కరించు మాటలు
పాలకులు నిషేధితున్నంటు తేల్చేస్తారు

ఇంకేం?
ఆంక్షలు "నోళ్లు" తెరుస్తాయి
సంకెళ్లు "ఒళ్ళు" విరుస్తాయ్
నిషేధాజ్ఞలు చుట్టుముడుతాయి
చీకటి చెరసాలలు "బంధీ" చేస్తాయి

సామ్రాజ్యవాదుల పాలనలో
నీలా...
బతుకు "తాకట్టు" పెట్టి
"ఊ" కొట్టే ప్రతివాడు
ఓ దేశ భక్తుడు

నాలా...
హక్కులకై నిక్కచ్చిగా నిలబడి
కలబడే వాడెప్పుడు....
ఓ  ద్రోహుడు
అవును!
నేనిప్పుడు ద్రోహినే...

-మీ నవీన్ రెడ్డి
అభ్యుదయ కవి
+91-9963691692

Comments

Popular posts from this blog

తండ్రి సంవత్సరిక విధానం....!!

పుస్తకంలో నాకో పేజీ!