బతుకు-అమ్మ......
బతుకమ్మ...
బతుకునిచ్చే అమ్మ...
బతికించే అమ్మ...
బతికే అమ్మ.
ఆడపిల్ల అంటే తనకుతాను బతకడమే కాదు, మరొకరికి బతుకునిస్తుంది.
ప్రకృతిలో చెట్టూ, పుట్టా,రాయి,రప్పా,పువ్వూ, కాయ,నీరు,గాలి...
ఎంత సహజంగా వచ్చాయో....
ఆడ,మగ కూడా అంతే సహజంగా పుట్టారు.
ఈ ప్రపంచంలో పునరుత్పత్తి చేయగల శక్తి ఒక్క స్ర్తీ జాతికే ఉంది.
అది చెట్టు అయిన సరే, మరో ప్రాణి అయినా సరే. చెట్టు నుండి పూలు, కాయలు వచ్చి ఆ జాతి విస్తరించినట్లు,
ఆడజీవి కూడా మరో ప్రాణికి జన్మనిచ్చి సంతతిని వృద్ధి చేస్తుంది.
బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులే కాదు, సంవత్సరం మొత్తం బతుకమ్మ ఆటలా ఆడపిల్ల జీవితం సాగాలి.
ఆనందంగా,నిర్భయంగా ఉండగలగాలి.
నేను ఆడపిల్లని అని గర్వంగా చెప్పుకునే స్థాయి కి ఎదగాలి.
అలాంటి మంచి రోజులు రావాలి.
అందరూ బతుకు అమ్మ అని స్త్రీ ని గౌరవించాలి.......
చివరిగా నా మాటగా మన భూమాత పై ఆడపిల్లని పుట్టనిద్దాం, బతకనిద్దాం,చదవనిద్దాం,ఎదగనిద్దాం, ముఖ్యంగా గౌరవిద్దాo..!
మీ...
నవీన్ రెడ్డి
అభ్యుదయ కవి
Comments
Post a Comment