నువ్వు చేరలేని తీరాన్ని నేను

నాపై మాటల తూటాలు
విసురుదామని చూస్తున్నారేమో,
ఇనుపకవచం కన్నా జఠిలమైనది
నా మనోబలం.
వెనుతిరిగి నేలరాలాల్సిందే
మీ సమయం.

కథలల్లి కాలక్షేపం చేస్తున్నారేమో,
రవ్వంతైనా నా మోమున
చిరునవ్వును చెరపలేదు
మీ ప్రతిఫలం.

నా ప్రపంచం నిత్యవాసంతపు విరివనం.
నిత్యం ఎన్నో పదాల మాలలల్లుకుంటాను.,
ఆ పరిమళాలను ఆఘ్రాణిస్తూ
పరవశమౌతాను.

నా నిత్యజీవనం సమస్యల వెంట పయనం...
అలల ఊయలపై కదలాడే
ఆశల సరాగం.

ఇక నా గమ్యం,
మీరు సాగించలేని పయనం,

మీరు ఎన్నటికీ చేరలేని తీరం.

నవీన్ రెడ్డి
అభ్యుదయ కవి

+91-9963691692


Comments

Popular posts from this blog

తండ్రి సంవత్సరిక విధానం....!!

పుస్తకంలో నాకో పేజీ!