నటన జీవితం

నటన జీవితం

నటనతోనే మనిషి  జీవితం మొదలు
అబద్ధమైన చిరునవ్వు పెదవులపై
స్వార్థపూరితమైన అభిమానం
అంధకారంలో బ్రతుకులు
ఆవేశంలో  దహించుకుపోతున్న జీవితాలు ......

రోజుకో నాటకం
మనిషి మనసుతో మాయల  మాటలు
జీవితమనే  ఈ రంగస్థలంలో
ఎవరిని నమ్మాలో  తెలియక
ఎవరిని అడగాలో తెలియక
నిజమైన ఆప్యాయత ఎక్కడ ఉందా అని
మనసులో అనుక్షణం ఓ జవాబు తెలియని
ప్రశ్నగా మిగిలిపోతున్నది .....

ఆశలకు అర్థమే మరిచి
ఆత్మగౌరమంటే విలువ చెరచి
ఊహలకు రూపం ఇస్తారు
హృదయాల మధ్య అనర్థాలు  ఎక్కువ చేసి
ఆలోచనలన్నీ అణిచేస్తూ
ప్రాణం ఎక్కడో  అటు ఇటు ఊసులాడే
దేహమేమో జీవమే లేక  ఇక్కడ
క్షణక్షణం రంగులు మార్చే
ఊసరవిల్లులే  చుట్టూ  చేరి
అన్యాయాలకు అందమైన  రంగును
పులిమి తోడుగా  నిలుస్తుంటే
భరించలేక బాధపడుతుంటే  .....


మోసం  చేస్తూ  నటించలేక
ఈ నాటకరంగంలో  నటించలేక
ఏంటో యీ జీవితం

@Knr's lines
@Copy rights reserved
+91-9963691692

Comments

Post a Comment

Popular posts from this blog

తండ్రి సంవత్సరిక విధానం....!!

పుస్తకంలో నాకో పేజీ!