కవి కలం.......
కలం ఎప్పుడు కూడా ఏదో రకంగా బలి అవుతూనే ఉంటుంది.....
కానీ నా కలం ఎప్పుడు దిక్కరిస్తూనే ఉంటుంది....
అధికార వ్యవస్థలో ఎన్నో రకాలుగా బలి అయ్యేది కవి కలమే.....
కవి ఎప్పుడైతే లొంగిపోతాడో
సమాజానికి చాలా చెడు జరిగే ప్రమాదమే ఉంది....
ఈరోజు కొందర్ని చూస్తున్నాం అలా....
వారి వల్లే నిజాయితీ గల సామాజిక స్పృహ ఉన్న ఎందరో మేధావి వర్గం గురి అవుతుంది....
తోత్తుల్ల పనిచేసే కవులు ఉన్నంత వరకు పాలక వర్గం యజమాయిషి చేస్తూనే ఉంటుంది.....
కవి ఎప్పుడైతే ప్రశ్నించే తత్వాన్ని అమ్ముకోడో అప్పుడే నవ సమాజ నిర్మాణం జరగడంలో భాగం అవుతాడు.....
అందుకే అంటాను
పేరు నిలిచిపోయేలా మీ మాటల తూటాలను లిఖించండి.....
ఈ భూమి నుండి పోయేది కేవలం నీ దేహం మాత్రమే కానీ నీ పేరు కాదు.....
శాశ్వత చిరునామా కోసం మీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా మార్చుకోండి.....
ఇట్లు
మీ......
నవీన్ రెడ్డి
అభ్యుదయ కవి
Comments
Post a Comment