Posts

Showing posts from February, 2023

జ్ఞానం!

Image
జన్మ జన్మల సత్యాన్ని సాధనతో తెలుసుకుని ఆజ్ఞానాంధకారం నుండి బయటపడి ఙ్ఞాన మార్గాలను చూపిన బుద్దుడు భాగ్యనగరం నడి ఒడ్డున నిల్చుని సత్యానికి, అసత్యానికి భేదాన్ని చూపిస్తే అదే బాటలో ప్రయాణం చేస్తూ ఈతరంలో పుట్టిన కేసిఆర్ (జ్ఞాని) అనే యోధుడు  జాతి గర్వపడేలా చరిత్రలో నిలిచిపోయే కార్యాలను చేస్తూ తెలంగాణ అమరవీరుల సాక్షిగా సచివాలయం సాక్షిగా అంబేడ్కర్ (జ్ఞాని) విగ్రహం సాక్షిగా అన్నీ ఒకేచోట  గొప్ప సందేశాన్ని ఇవ్వడం కోసం నెలకోల్పడం చూస్తే ఈ జాతికి ఇచ్చే గౌరవం ఈ జాతి మీద బాధ్యత అర్థమవుతుంది ఇది ఎవరు కాదనలేని ఒక చరిత్ర! By - Kallem Naveen Reddy 

చేసింది గొప్పగా చెప్పుకుందాం చాలు!

Image
భాధ్యతగా చేసే పోరాటంలో గొప్ప భావనతో పాటుగా  భాద్యతగా పనిచేసే అవకాశాలు మాత్రమే ఉంటాయి! ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎలా చేయాలని చర్చించేదే ముఖ్యం సానుకూలతపై దృష్టి పెడుతూ పనిచేస్తే గుర్తింపు కచ్చితంగా వస్తుంది కానీ ప్రయాణం చేస్తూనే ఉండాలి అంతే! తెలంగాణ రాష్ట్రాన్నే సాధించడానికి పెట్టిన పార్టీకి  ఎంత చేసిన తక్కువే కదా ఎందుకంటే ఒకప్పుడు ఇప్పుడు పరిస్ధితులు  మనకళ్ళ ముందే సజీవంగా కనిపిస్తున్నాయి! ఇప్పుడు ముఖ్యంగా దేశాన్ని రక్షించుకోవడం కోసం  చేసే ఈ మహాయుద్ధంలో పాల్గొనే అవకాశం వచ్చింది చైతన్యపు దిశగా ఆ యోధునితో అడుగులు వేయడం భవిష్యత్ తరాలకు మార్గం చూపడమే అవుతుంది! నాకు కచ్చితంగా నమ్మకం ఉంది రాబోయే కాలంలో ప్రజలు చైతన్యం అవుతారు గొప్ప మార్పు సంభవిస్తుంది! ఆ మార్పులో మన భాగస్వామ్యం గొప్పగా ఉండాలి నిత్యం మనం చేసిన అభివృద్ది పనులను  సబ్జెక్ట్ తో ప్రచారం చేస్తూ వెళితే చాలు అనుకున్న లక్ష్యాలను చేరడం సులభం అవుతుంది! ఏమి చేయలేని వాడే అందంగా అసత్య ప్రచారాలు చేసుకుంటూ నిజాలుగా నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఎంతో గొప్పగా పాలన చేస్తున్నప్పుడు చెప్పుకోకపోతే తప్పు మనదే! ఇక మూర్ఖులతో ...

దేశాన్ని అందంగా చెక్కుకునే శిల్పి కేసిఆర్ మాత్రమే!_____________________________________

Image
దేశం కొన్ని రాష్ట్రాల సముదాయమే అయినప్పుడు కొన్ని రాష్ట్రాల మీద వివక్ష చూపుతున్న ప్రభుత్వం మనకు అవసరమా? రాష్ట్రాలను బిడ్డలెక్క సాధుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే అయినప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఒకలెక్క వేరే ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలు ఒకలెక్క ఉంటాయా? చెప్పేవి ధర్మ సూత్రాలు అయినప్పుడు పాటించేవి కూడా ఉంటే బాగుండేది. రాజకీయ పార్టీ అంతిమ లక్ష్యం అధికారమే అయినప్పుడు పాలనలో లోపాలు ఉండకూడదు! తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే ప్రత్యేక రాష్ట్రాన్నే తెచ్చుకున్నాం అలాంటి రాష్ట్రం మీద ఇంకా వివక్షే కొనసాగితే అనుకున్న లక్ష్యాలను నెరవేర్చడానికి కొత్త ఉద్యమం రూపుదిద్దుకుంది! ఒక కచ్చితమైన సమాధానం చెప్పడానికి కేసిఆర్ అనే ఆయుధాన్ని ఈ దేశం తయారుచేసుకుంటుంది. ఒక మహా గ్రంధాన్ని అర్దం చేసుకోని మీరు ఎన్నటికీ ఒక గొప్ప నాయకులుగా చరిత్ర పుటల్లో మిగిలిపోలేరన్నది వాస్తవమైన మాట! కాళేశ్వరం ప్రాజెక్ట్ గమనిస్తేనే కేసిఆర్ గురించి అర్దం అవుతుంది. కేంద్రం నుండి ఒక్క రూపాయి సహాయం లేకుండా ఆ ప్రాజెక్ట్ అన్నీ వేల కోట్లతో రైతుల కన్నీరు తుడవడానికి చేశాడంటే ఆయన ప్లేస్ లో ఇంకెవరూ ఉన్న ఇలాంటి గొప్ప కార్యాలు చేయలేరన...

తప్పెవరిది?

Image
తప్పెవరిదని కదా ప్రశ్నించాల్సింది ప్రశ్నించుకోవాల్సింది!? పక్కనున్న వాళ్ళు భరోసాగా నిలిచి ఉంటే తప్పును ఖండించి ఉంటే ఆ ఆకతాయిని నిలదీసి ఉంటే ఆమె చదివిన ఉన్నత చదువులు ఆమె కలలు గన్న డాక్టర్ వృత్తికి మనం న్యాయం చేసిన వాళ్ళం అయ్యేవాల్లం! ఆమె తోటి సిబ్బంది అండగా నిలిచిన అంతటి దారుణం జరగకుండా ఉండేది అయినా మనదేమి తప్పే కానట్టు అన్నీ మాట్లాడుతాము! ఆత్మహత్య చేసుకునే సమయంలో కన్నవాళ్లు గుర్తొచ్చి ఎన్ని కన్నీళ్లు పెట్టుకుందో? ఎన్ని ఆలోచనలు ఆమెను చంపాయో? ఎన్ని ఆలోచనలు ఆమెను ఆమె నుండి దూరం చేసాయో? ఎన్ని ఆలోచనలు ఆమెను క్రుంగదీశాయో? చనిపోయాక శ్రద్ధాంజలి ఘటించి RIP లంటూ స్టేటస్ లు పెట్టీ కళ్లముందే జరుగుతున్న దాడులపై ప్రతిఘటించే ప్రయత్నాలేమి చేయకుండా మన పరిధిలో  అవకాశం ఉండి కూడా ఇలాంటివెన్నో సంఘటనలను ఆపకుండా ప్రతీది ప్రభుత్వానికి అంటగడుతున్న పాశవిక మేధావులే  ఇలాంటి హత్యలకు (ఆత్మహత్యలకు) కారణం! ( స్త్రీ అనుకుంటే గాడ్రించి పైకస్తున్న సింహాన్ని కూడా ఎదుర్కోగలదు.... దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు ) #Preethi Kallem Naveen Reddy

అడవి!

Image
అడవంటే ఎందరికో అమ్మ పచ్చదనాన్ని పరుచుకునేందుకు లేలేతగా ముస్తాబవ్వడం కోసం తన శరీరం నుండి రాలిన ఆకులను ఈ ఎండాకాలంలో కాగడై కాల్చుకుంటున్నది! ప్రకృతి కాంత ఒలికించే అందాలను ఈ పుడమికి ఇవ్వడానికి వర్షాకాలం కోసం ఎదురుచూస్తూ  తనిప్పుడు రాలిపోయి కాలుతున్నది! ఆకాశం వంతెన కింద కాలంతో ప్రవహిస్తూనే ఉండే ఆకుపచ్చ సముద్రం తను! తన గుండా ఎన్నో ఉదయాలను ఎన్నో కారుచీకట్లను ఎన్నో మంచు తెరలను చీల్చుకొని ఆకు పచ్చ జలపాతమై తన అందాలను ఆరబోస్తూనే ఉంటుంది రేపటి తరాల కోసం పరితపిస్తూనే ఉంటుంది! || చెట్లను పెంచుదాం || || చెట్లను కాపాడుకుందాం || || అది మన భాధ్యత || (ఈరోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తీసిన ఫోటో ఇందులో నాకే తెలియకుండా Jupiter, Moon and Venus ఉన్నాయి. తీసిన తర్వాత తెలిసింది. 23 Feb,2023) Kallem Naveen Reddy

తేడా గమనించు!

ఆ మత పార్టీ పిల్లలు విదేశాల్లో చదువుతున్నారు  మన పిల్లలు విద్వేషాల్లో మునుగుతున్నారు! మతాల నీడలో వాళ్ళు తలదాచుకునేందుకు మనతో అడేది రాజకీయాల వేశాలేనని గమనించాలి ఈ భారతం! వాళ్ళు రెచ్చగొడుతున్నారు మనం రెచ్చిపోతున్నాము! వాళ్ళది తప్పా లేక వాళ్ళను పెంచి పోషిస్తున్న మనది తప్పా తెలుసుకుని వాళ్ళకు శాశ్వత విముక్తిని ప్రసాదించుదాం! మతాల పునాదుల్లో ఎన్నటికీ గొప్ప భారతాన్ని నిర్మించలేరని నీవు ఆత్మజ్ఞాన చైతన్యడువై మేలుకోవడం ఇప్పుడు అనివార్యం! ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఆకలి మంటల్లో ఆకలి చావుల ఆర్తనాదాలు వినిపించడం అలాగే ఉంది అయిన మనం చర్చలు చేయకుండా రచ్చ చేస్తూనే ఉందామా?  ఈ వ్యవస్థలో ఇంకా అవస్థలు పడుతూనే ఉన్నాం  ఆనాటి నుండి ఈనాటి వరకు ఇన్నేళ్ల ఈ భారతంలో ఇంకా ఈ విద్వేషాల రొచ్చులో ప్రాకులాడుతూ ఉండకు. దేశం ఇంకా ఇంకా అభివృద్ది చెందుతున్న దేశంగానే చెప్పుకుంటున్నాం అంటే కారకులు గత పాలక ప్రభుత్వాల వైఫల్యాలే! లే  మేలుకో ఈ సమాజాన్ని మేలుకోలుపు! Kallem Naveen Reddy (KNR)