చేసింది గొప్పగా చెప్పుకుందాం చాలు!
భాధ్యతగా చేసే పోరాటంలో
గొప్ప భావనతో పాటుగా
భాద్యతగా పనిచేసే అవకాశాలు మాత్రమే ఉంటాయి!
ఇప్పుడు మనం ఏం చేయాలి?
ఎలా చేయాలని చర్చించేదే ముఖ్యం
సానుకూలతపై దృష్టి పెడుతూ
పనిచేస్తే గుర్తింపు కచ్చితంగా వస్తుంది
కానీ ప్రయాణం చేస్తూనే ఉండాలి అంతే!
తెలంగాణ రాష్ట్రాన్నే సాధించడానికి పెట్టిన పార్టీకి
ఎంత చేసిన తక్కువే కదా
ఎందుకంటే ఒకప్పుడు ఇప్పుడు పరిస్ధితులు
మనకళ్ళ ముందే సజీవంగా కనిపిస్తున్నాయి!
ఇప్పుడు ముఖ్యంగా దేశాన్ని రక్షించుకోవడం కోసం
చేసే ఈ మహాయుద్ధంలో పాల్గొనే అవకాశం వచ్చింది
చైతన్యపు దిశగా ఆ యోధునితో అడుగులు వేయడం
భవిష్యత్ తరాలకు మార్గం చూపడమే అవుతుంది!
నాకు కచ్చితంగా నమ్మకం ఉంది
రాబోయే కాలంలో ప్రజలు చైతన్యం అవుతారు
గొప్ప మార్పు సంభవిస్తుంది!
ఆ మార్పులో మన భాగస్వామ్యం గొప్పగా ఉండాలి
నిత్యం మనం చేసిన అభివృద్ది పనులను
సబ్జెక్ట్ తో ప్రచారం చేస్తూ వెళితే చాలు
అనుకున్న లక్ష్యాలను చేరడం సులభం అవుతుంది!
ఏమి చేయలేని వాడే అందంగా అసత్య ప్రచారాలు చేసుకుంటూ నిజాలుగా నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు
ఎంతో గొప్పగా పాలన చేస్తున్నప్పుడు
చెప్పుకోకపోతే తప్పు మనదే!
ఇక మూర్ఖులతో వాదనలు చేసి
విలువైన సమయాన్ని వృధా చేసుకోవడం కంటే
ఆ వాదనల సమయాన్ని సానుకూలత అంశాలపై
దృష్టి పెడుతూ వాటినే ప్రచారం చేస్తే చాలు!
ఎవరెన్ని అసత్య ప్రచారాలు చేసిన
మనం పాజిటివ్ గా చేసే పనులు
సమాధానాలుగా నిలుస్తాయి
అవే అవే విజయ తీరాలకు చేరుస్తాయి!
- Kallem Naveen Reddy
Comments
Post a Comment