తప్పెవరిది?

తప్పెవరిదని కదా
ప్రశ్నించాల్సింది
ప్రశ్నించుకోవాల్సింది!?
పక్కనున్న వాళ్ళు
భరోసాగా నిలిచి ఉంటే
తప్పును ఖండించి ఉంటే
ఆ ఆకతాయిని నిలదీసి ఉంటే
ఆమె చదివిన ఉన్నత చదువులు
ఆమె కలలు గన్న డాక్టర్ వృత్తికి
మనం న్యాయం చేసిన వాళ్ళం అయ్యేవాల్లం!
ఆమె తోటి సిబ్బంది అండగా నిలిచిన
అంతటి దారుణం జరగకుండా ఉండేది
అయినా మనదేమి తప్పే కానట్టు
అన్నీ మాట్లాడుతాము!
ఆత్మహత్య చేసుకునే సమయంలో
కన్నవాళ్లు గుర్తొచ్చి ఎన్ని కన్నీళ్లు పెట్టుకుందో?
ఎన్ని ఆలోచనలు ఆమెను చంపాయో?
ఎన్ని ఆలోచనలు ఆమెను ఆమె నుండి దూరం చేసాయో?
ఎన్ని ఆలోచనలు ఆమెను క్రుంగదీశాయో?
చనిపోయాక శ్రద్ధాంజలి ఘటించి
RIP లంటూ స్టేటస్ లు పెట్టీ
కళ్లముందే జరుగుతున్న దాడులపై
ప్రతిఘటించే ప్రయత్నాలేమి చేయకుండా
మన పరిధిలో  అవకాశం ఉండి కూడా
ఇలాంటివెన్నో సంఘటనలను ఆపకుండా
ప్రతీది ప్రభుత్వానికి అంటగడుతున్న
పాశవిక మేధావులే 
ఇలాంటి హత్యలకు (ఆత్మహత్యలకు) కారణం!

( స్త్రీ అనుకుంటే గాడ్రించి పైకస్తున్న సింహాన్ని కూడా ఎదుర్కోగలదు.... దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు )

#Preethi

Comments

Popular posts from this blog

తండ్రి సంవత్సరిక విధానం....!!

పుస్తకంలో నాకో పేజీ!