తేడా గమనించు!

ఆ మత పార్టీ పిల్లలు విదేశాల్లో చదువుతున్నారు 
మన పిల్లలు విద్వేషాల్లో మునుగుతున్నారు!

మతాల నీడలో వాళ్ళు తలదాచుకునేందుకు మనతో అడేది రాజకీయాల వేశాలేనని గమనించాలి ఈ భారతం!

వాళ్ళు రెచ్చగొడుతున్నారు
మనం రెచ్చిపోతున్నాము!

వాళ్ళది తప్పా లేక
వాళ్ళను పెంచి పోషిస్తున్న మనది తప్పా
తెలుసుకుని వాళ్ళకు శాశ్వత విముక్తిని ప్రసాదించుదాం!

మతాల పునాదుల్లో ఎన్నటికీ గొప్ప భారతాన్ని
నిర్మించలేరని నీవు ఆత్మజ్ఞాన చైతన్యడువై మేలుకోవడం ఇప్పుడు అనివార్యం!

ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఆకలి మంటల్లో ఆకలి చావుల ఆర్తనాదాలు వినిపించడం అలాగే ఉంది అయిన మనం చర్చలు చేయకుండా రచ్చ చేస్తూనే ఉందామా? 

ఈ వ్యవస్థలో ఇంకా అవస్థలు పడుతూనే ఉన్నాం 
ఆనాటి నుండి ఈనాటి వరకు
ఇన్నేళ్ల ఈ భారతంలో ఇంకా ఈ విద్వేషాల రొచ్చులో ప్రాకులాడుతూ ఉండకు. దేశం ఇంకా ఇంకా అభివృద్ది చెందుతున్న దేశంగానే చెప్పుకుంటున్నాం అంటే కారకులు గత పాలక ప్రభుత్వాల వైఫల్యాలే!

లే 
మేలుకో
ఈ సమాజాన్ని
మేలుకోలుపు!


Comments

Popular posts from this blog

తండ్రి సంవత్సరిక విధానం....!!

పుస్తకంలో నాకో పేజీ!