దేశాన్ని అందంగా చెక్కుకునే శిల్పి కేసిఆర్ మాత్రమే!_____________________________________

దేశం కొన్ని రాష్ట్రాల సముదాయమే అయినప్పుడు కొన్ని రాష్ట్రాల మీద వివక్ష చూపుతున్న ప్రభుత్వం మనకు అవసరమా?

రాష్ట్రాలను బిడ్డలెక్క సాధుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే అయినప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఒకలెక్క వేరే ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలు ఒకలెక్క ఉంటాయా?

చెప్పేవి ధర్మ సూత్రాలు అయినప్పుడు పాటించేవి కూడా ఉంటే బాగుండేది. రాజకీయ పార్టీ అంతిమ లక్ష్యం అధికారమే అయినప్పుడు పాలనలో లోపాలు ఉండకూడదు!

తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే ప్రత్యేక రాష్ట్రాన్నే తెచ్చుకున్నాం అలాంటి రాష్ట్రం మీద ఇంకా వివక్షే కొనసాగితే అనుకున్న లక్ష్యాలను నెరవేర్చడానికి కొత్త ఉద్యమం రూపుదిద్దుకుంది!

ఒక కచ్చితమైన సమాధానం చెప్పడానికి కేసిఆర్ అనే ఆయుధాన్ని ఈ దేశం తయారుచేసుకుంటుంది. ఒక మహా గ్రంధాన్ని అర్దం చేసుకోని మీరు ఎన్నటికీ ఒక గొప్ప నాయకులుగా చరిత్ర పుటల్లో మిగిలిపోలేరన్నది వాస్తవమైన మాట!

కాళేశ్వరం ప్రాజెక్ట్ గమనిస్తేనే కేసిఆర్ గురించి అర్దం అవుతుంది. కేంద్రం నుండి ఒక్క రూపాయి సహాయం లేకుండా ఆ ప్రాజెక్ట్ అన్నీ వేల కోట్లతో రైతుల కన్నీరు తుడవడానికి చేశాడంటే ఆయన ప్లేస్ లో ఇంకెవరూ ఉన్న ఇలాంటి గొప్ప కార్యాలు చేయలేరన్నది చరిత్ర చెపుతున్న సత్యం!

ఎనిమిదేళ్ళ కేంద్రం పాలన ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ కి కూడా సరితూగదు. తెలంగాణ రాష్ట్రం లాంటి పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నప్పుడు అలాంటి పాలన అన్నీ రాష్ట్రాల్లో ఎందుకు జరగదు. తెలంగాణ లెక్క ప్రతి రాష్ట్రం నిర్మితం అవ్వాలనే గొప్ప ఆశయంతో ఆ యోధుడి పర్యటనలు వేగాన్ని సంతరించుకున్నాయి!

అనుకుంటే చేసేదాకా పట్టు వదలదు అది ఆయన రక్తంలోనే ఉంది. చరిత్ర పుటల్లో ఒక పేజీని సరికొత్తగా నిత్య నూతనంగా చెక్కుకునే నిర్విరామంగా పనిచేసే ఒక గొప్ప శిల్పి!

ఇక కేసిఆర్ గారు అర్దం కావాలంటే అయనలాగే ఆలోచించాల్సి ఉంటుంది. ఈ భూమి ఆవిర్భవించినప్పటి నుండి గొప్ప గొప్ప వ్యక్తులు జీవించిన కాలాన్ని ఆ చరిత్రను చదివితే ఇలాంటి వ్యక్తిత్వాలు అర్దం అవుతాయి!

రాజకీయాలకు కొత్త నిర్వచనం కోసం దేశం ఒక గొప్ప నాయకున్ని తయారుచేసుకుంది!

ఒక వ్యక్తి మీద గెలవడానికి 
రెండు జాతీయ పార్టీ నాయకులు అనవసరమైన మాటలతో యుద్దాలు చేస్తున్నారు అంటే
నేరుగా ఎదుర్కునే దమ్ములేక,
ఇది కదా ఒక వ్యక్తి గెలుపు!

గల్లీ నుండి ఢిల్లీ కి వచ్చే సత్తా ఉన్నోన్ని
దేశ రాజకీయాలను సమూలంగా మార్చే శక్తితో పెట్టుకున్నారు
ఒక వ్యక్తితో కాదు మీరు పెట్టుకుంది
ఒక శక్తితో అనేది భవిష్యత్ లో సమాధానంగా కనిపిస్తుంది!

ప్రపంచం అర్దం కానీ సన్నాసులకు కేసిఆర్ ఎలా అర్దం అవుతాడు
దేశం మీద భక్తితో కేవలం స్లొగన్స్ ఇవ్వడం కాదు
దేశ భవిష్యత్ కోసం పాటుపడాలి!

ఆకలికి ఏడ్చే కడుపులు అలాగే ఉన్నాయి
ధనవంతుడు మరింత ధనవంతుడు అవుతున్నాడు
దేశ సంపద కొద్దిమంది చేతుల్లోకి వెళ్తుంది!

ఏ రాజకీయ పార్టీ అయినా మతాల పేరుతో ఎన్నటికీ జాతిని ఒక్కటి చేయలేదు ఒక గొప్ప భారతాన్ని నిర్మించలేదు!

అల్లర్లు చేయడం, విద్వేషాలు సృష్టించడం తప్ప మీరు దేశం కోసం శాంతిని ఎన్నటికీ నెలకొల్పలేని మీ రాజకీయ పార్టీకి మతాన్ని అంటించుకున్న మరకలు మాత్రమే ఇక్కడ!

దేశ గల్ల పెట్టమీద మీరు పూటకోవేషం వేస్తూ దాని తాళాన్ని కొద్దిమంది చేతుల్లో పెట్టీ వ్యవస్థలో అసలైన అంతరాలు సృష్టిస్తూ రాజకీయ పబ్బం గడుపుతూ ఊరేగడం లాంటివి చూస్తూ ఒక వ్యక్తి రూపంలో రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పడానికి దేశం ఒక గొప్ప నాయకున్ని తయారుచేసుకుంది!

#JaiBharath
#DeshkanethaKCR

By

Comments

Popular posts from this blog

తండ్రి సంవత్సరిక విధానం....!!

పుస్తకంలో నాకో పేజీ!