అడవి!
అడవంటే ఎందరికో అమ్మ
పచ్చదనాన్ని పరుచుకునేందుకు
లేలేతగా ముస్తాబవ్వడం కోసం
తన శరీరం నుండి రాలిన ఆకులను
ఈ ఎండాకాలంలో కాగడై కాల్చుకుంటున్నది!
ప్రకృతి కాంత ఒలికించే అందాలను
ఈ పుడమికి ఇవ్వడానికి
వర్షాకాలం కోసం ఎదురుచూస్తూ
తనిప్పుడు రాలిపోయి కాలుతున్నది!
ఆకాశం వంతెన కింద
కాలంతో ప్రవహిస్తూనే ఉండే
ఆకుపచ్చ సముద్రం తను!
తన గుండా ఎన్నో ఉదయాలను
ఎన్నో కారుచీకట్లను
ఎన్నో మంచు తెరలను
చీల్చుకొని
ఆకు పచ్చ జలపాతమై
తన అందాలను ఆరబోస్తూనే ఉంటుంది
రేపటి తరాల కోసం పరితపిస్తూనే ఉంటుంది!
|| చెట్లను పెంచుదాం ||
|| చెట్లను కాపాడుకుందాం ||
|| అది మన భాధ్యత ||
(ఈరోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తీసిన ఫోటో ఇందులో నాకే తెలియకుండా Jupiter, Moon and Venus ఉన్నాయి. తీసిన తర్వాత తెలిసింది. 23 Feb,2023)
Comments
Post a Comment