చెడ్డకాలానికున్నా మంచితనం ఏమో
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhw22VRBBG9XNKyiqf7_uZje-Co5FFYXymlvHX7MOIEUqBGxVEh-RRG_QPKsgxvIkoPJ3Yoh-tIeZP22qUs9rkW3Tt3KLnZxCpVoQlSAWRWE31ioTFJJ_TPK2xSzeYfgFD5SojiGTLFA-o/s320/IMG_20190703_121600.jpg)
చెడ్డకాలానికున్న మంచి తనం ఏమో కలకాలం కుదురుగా ఉండలేకపోయింది! బరువెక్కిన బంధాలకు అనుబంధాల విలువ తెలియదుగా ఎంత అలసినా ఆ ఈతకి తీరమసలుండదు ఎన్ని సార్లు నచ్చ చెప్పిందో ఈ చెడ్డకాలం బతుకుతీపికి మాత్రం అంతమసలుండదు చెడ్డకాలానికున్న మంచి తనం ఏమో కలకాలం కుదురుగా ఉండలేకపోయింది! బరువెక్కిన భారాల బంధాలు తెంపింది అంతరంగాల మధ్య శూన్యాన్ని నింపింది ఎన్ని సార్లు బుద్ధి చెప్పిందో చెడ్డకాలం మనసు మాత్రం మమతలతో దైన్యాన్ని చూపింది చెడ్డకాలానికున్న మంచి తనం ఏమో కలకాలం కుదురుగా ఉండలేకపోయింది! కాని కష్టాల కన్నీటిని తెప్పించింది దాగున్న విలువల వలువలు విప్పించింది ఎన్ని సార్లు తేల్చి చెప్పిందో ఈ చెడ్డకాలం సుఖం మాత్రం నిజాలని అహాలతో తప్పించింది చెడ్డకాలానికున్న మంచి తనం ఏమో కలకాలం కుదురుగా ఉండలేకపోయింది! వాడుకునే బంధాలే చుట్టూ భజన చేస్తూ అవసరం తీరాక బంధాలను సమాధి చేస్తూ జీవితమే శాశ్వతం కాదు కదా ఒకరోజు అనుకోకుండా వచ్చే మరణం ఉంది కదా చెడ్డకాలానికున్న మంచి తనం ఏమో కలకాలం కుదురుగా ఉండలేకపోయింది! క...