చెడ్డకాలానికున్నా మంచితనం ఏమో



చెడ్డకాలానికున్న మంచి తనం ఏమో
కలకాలం కుదురుగా ఉండలేకపోయింది! 
 
బరువెక్కిన బంధాలకు అనుబంధాల విలువ తెలియదుగా
ఎంత అలసినా ఆ ఈతకి తీరమసలుండదు
ఎన్ని సార్లు నచ్చ చెప్పిందో ఈ చెడ్డకాలం
బతుకుతీపికి మాత్రం అంతమసలుండదు     

చెడ్డకాలానికున్న మంచి తనం ఏమో
కలకాలం కుదురుగా ఉండలేకపోయింది!   

బరువెక్కిన భారాల బంధాలు తెంపింది
అంతరంగాల మధ్య శూన్యాన్ని నింపింది
ఎన్ని సార్లు బుద్ధి  చెప్పిందో చెడ్డకాలం
మనసు మాత్రం మమతలతో దైన్యాన్ని చూపింది

చెడ్డకాలానికున్న మంచి తనం ఏమో
కలకాలం కుదురుగా ఉండలేకపోయింది!   

కాని కష్టాల కన్నీటిని తెప్పించింది
దాగున్న విలువల వలువలు విప్పించింది
ఎన్ని సార్లు తేల్చి చెప్పిందో ఈ చెడ్డకాలం
సుఖం మాత్రం నిజాలని అహాలతో తప్పించింది

చెడ్డకాలానికున్న మంచి తనం ఏమో
కలకాలం కుదురుగా ఉండలేకపోయింది!   

వాడుకునే బంధాలే చుట్టూ భజన చేస్తూ
అవసరం తీరాక బంధాలను సమాధి చేస్తూ
జీవితమే శాశ్వతం కాదు కదా
ఒకరోజు అనుకోకుండా వచ్చే మరణం ఉంది కదా

చెడ్డకాలానికున్న మంచి తనం ఏమో
కలకాలం కుదురుగా ఉండలేకపోయింది! 

కాటికే పోయె మనిషి ఎందుకో ఎగిరెగిరి పడుతున్నాడు
జీవిత ఆంతర్యం ఏమిటో తెలుసుకోకుండా
నమ్ముకున్న బంధాలను అంగట్లో అమ్ముతూ
నీచమైన ఆలోచనలతో బతికేస్తున్నారు

చెడ్డకాలానికున్న మంచి తనం ఏమో
కలకాలం కుదురుగా ఉండలేకపోయింది! 

నిన్న,నేడు,రేపు అనేది మన ఆధీనంలో లేదు కదా
అలాంటిది మన ఈ జీవితం ఎంత
తెలుసుకో మనిషి జీవన గమనం మనసుతో
తుమ్మితే ఊడిపోయి ఓడిపోయే జీవితమే కదా ఇది

చెడ్డకాలానికున్న మంచి తనం ఏమో
కలకాలం కుదురుగా ఉండలేకపోయింది! 

వీలైతే గొప్పగా బతికిపో సచ్చేదాక
చితికిపోతూ బతికిపోకూ
తరాలు గుర్తుంచుకునే లా సచ్చిపో
దేహానికె మరణం కానీ గొప్ప గొప్ప జీవితాలకు కాదు
గొప్ప గొప్ప వ్యక్తిత్వాలకు కాదు

చెడ్డకాలానికున్న మంచి తనం ఏమో
కలకాలం కుదురుగా ఉండలేకపోయింది! 

కాలంతో మారాల్సింది మన ఆలోచనలే కానీ
మనం కాదు మన బంధుత్వాలు కాదు
ఇది తెలుసుకొని జీవించు
రెప్పపాటు జీవితమే కదా ఇది

By
నవీన్ రెడ్డి
అభ్యుదయ కవి








Comments

  1. Kalamlo maralsindhi mana alochanalu manam kadhu

    ReplyDelete
  2. you have a great future ahead anna....i didn't expect from you this kind of talent anna....by the way you have a great command on words keep it up anna

    ReplyDelete
  3. I congrats you to selected for the youth litrature award.... Keep this momentum to get more awards....... 🤝🤝🤝 👌👌👌

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

తండ్రి సంవత్సరిక విధానం....!!

పుస్తకంలో నాకో పేజీ!