తండ్రి సంవత్సరిక విధానం....!!

శ్రాధ్ కర్మ అనేది శ్రాధ్ కర్మ అనేది సంవత్సరికం విధానం , ఇది ఎంతో భాధ్యత గా చేసుకోవాల్సి ఉంటుంది. మాసికం, విమోకం మరియు పరమాత్మ అబ్దికం నవగ్రహ శాంతి పూజలు కుటుంబం లోని సభ్యులందరూ కలిసి చేస్తారు!

చనిపోయినప్పుడు ఆత్మ ఎక్కడనుండి అయితే వెళ్ళిందో ఆ మరణించిన వాళ్ల ఆత్మ శాంతి కలగాలని వారియొక్క బంధువులతో కలిసి తండ్రికి తలకొరివి పెట్టిన పెద్ద కుమారులందరూ తద్దినం ఆచారాన్ని సక్రమంగా నిర్వహించాలి. ఆ పూజను చేయడానికి ఆచారున్ని పిలిపించి అందరూ కలిసి సంతోషంగా చేస్తారు.  తండ్రికి తలకొరివి పెట్టిన వాళ్ళు ఆ తండ్రికి పుట్టిన కుమారులతో కలిసి చేయకుండా వేరుగా చేసినట్టు అయితే ఆ తండ్రి ఆత్మకు శాంతి లేకుండా చేసినట్టు అవుతుంది. తలకొరివి పెట్టిన వాళ్ళు అలా చేయడం మహాపాపం. ఆ పాపం మరణించిన కానీ పోదు. తర తరాలుగా ఆ పాపం వెంట వస్తూనే ఉంటాయని పురాణాలు చెపుతున్నాయి. అన్నీ  కార్యక్రమాలు సక్రమంగా నిర్వహిస్తేనే తలకొరివి పెట్టాల్సి ఉంటుంది. అలా శ్రాద్ కర్మ వరకు విధానాన్ని పాటించాలి!

సంవత్సరికం ప్రక్రియ యొక్క ఆచారాలు ఇతర శ్రాద్ధ వేడుకల మాదిరిగానే ఉంటాయి. మరణించిన ఆత్మకు శాంతి మరియు మోక్షాన్ని ప్రసాదించడానికి పూజలు నిర్వహిస్తారు. ఎవరైతే ఈ విధానం పద్దతి ప్రకారం చేసుకోకుండా ఆ చనిపోయిన వ్యక్తి భార్య బతికి ఉండగా ఆత్మ ఎక్కడి నుండి వెళ్ళిపోయిందో అక్కడే తలకొరివి పెట్టిన వాళ్ళు చేసుకోవాలి. చివరి వరకు ఆ చనిపోయిన వ్యక్తికి సంతానం ఉండగా ఆ తలకొరివి పెట్టిన వ్యక్తి తమ ఇష్టానుసారం చేసుకుంటారో ఆ వ్యక్తికి ఏ జన్మలో అయిన  సరే పాప పరిహారం పోదు. పాపం అనేది నీడలా వెంట వస్తూనే ఉంటుంది. పురాణాల ప్రకారం కర్మలు అనుభవించాల్సి ఉంటుంది!

మరణించిన ఆత్మల మొదటి వర్ధంతి సందర్భంగా శ్రాద్ వేడుక సంవత్సరికం మనం ఎంతో భాధ్యత గా నిర్వహిస్తాము.  పితృ దేవతల ఆశీర్వాదం పొందడానికి పెద్ద కుమారుడు సంవత్సరికం ఆ తండ్రికి పుట్టిన సంతానం తో కలసి నిర్వహిస్తాడు మరియు నిర్ణీత రోజున ప్రాథమిక కర్తగా అన్ని కర్మలను పూర్తి చేస్తాడు. అతను శాస్త్రాలు మరియు పురాణాల ద్వారా అర్హులైన బ్రాహ్మణులకు దానం కూడా చేస్తాడు. అలా చేయని వాళ్ళు తలకొరివి పెట్టీ వృధా. వాళ్ళు పుట్టి కూడా మన సంప్రదాయాల ప్రకారం ఎలాంటి ఉపయోగం లేదు. వాళ్ళు మహపాపులు. అలాంటి వాళ్ళు బతికి ఉండగానే అన్నీ రకాలైన ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటి వాళ్ళకు కాలమే సమాధానంగా ఉంటుంది!

తరతరాలుగా పెద్దలు ఆచరిస్తున్న సంప్రదాయాలను అనుసరించి ఈ భూమి మీద నడుచుకోవాల్సి ఉంటుంది. అలాగే జీవించాలి. కొన్ని విలువలు పాటించాలి. పెద్దలు ఏది ఊరికే అనలేదు. ఎంతో జ్ఞానాన్ని, పద్దతులను మనకు అందించారు. ఆ జ్ఞాన పరంపరలతో కార్యాలు చేస్తూ ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి ఈ పుట్టుకను ఎంతో గొప్పదిగా భావించి ప్రయాణం సాగించాలి. ఏది కూడా ఒకరితోనే ముగింపు ఉండదు అలాంటి పరిస్థితులే ఎవరి జీవితంలో అయిన ఉంటాయి. కేవలం కొడుకులుగా పుట్టినంత మాత్రానా సరిపోదు. తల్లి దండ్రుల కోసం తల్లడిల్లాలి. మంచి చెడ్డలు పట్టించుకోని పలకరిస్తూ ఉండాలి. ఏనాడు కూడా పట్టించుకోకుండా ఏదో మంది భాధకు వచ్చి పేరుకు పెద్దకొడుకనీ తలకొరివి పెడితే సరిపోదు కదా. తర్వాత జరిగే అన్ని ప్రక్రియలను శాంతి కలగాలని కోరుకుంటూ కుటుంబంతో కలిసే చేసుకోవాలి. అలా కాకుండా ఎలా చేసుకున్నా తలకొరివి పెట్టిన వాళ్లకు మంచిది కాదు. ఏదో ఒక సందర్భంలో సృష్టి ద్వారా జరిగే దానికి మనం బాధితులమే అవుతాము. ఎందుకంటే ఈ జన్మకు సార్థకత కొన్ని క్రియల ద్వారా చేకూరుతుంది. తండ్రికి శాంతి కలగాలని కోరుకోవడం తలకొరివి పెట్టిన వాళ్ళు కలసి కుటుంబ సభ్యులతో చేసుకోవడం ధర్మ కర్తృత్వ నియమాలుగా ఉంటుంది!
  
ఇక తల్లి దండ్రులను చనిపోయెంత వరకు ఎవరైతే , ఏ సంతానమైతే చూసుకుంటారో వాళ్ళ వైపే మన హిందూ సాంప్రదాయం ప్రకారం శాస్త్రాలు పురాణాలు కర్మలు వివరిస్తున్నాయి. ఈ విధంగా చివరగా సంవత్సరికం చేయడం ద్వారా, పితృలోకం నుండి పితృ అనుగ్రహాన్ని పొందుతారు. ఎలాంటి వివాదాలకు అవకాశం ఇవ్వకుండా పెద్ద కొడుకు తన ధర్మాన్ని అనుసరించి కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించుకోవాలి. పితృ దోషాలు లేకుండా శక్తిని పొందుతారు. మరణించిన వ్యక్తి యొక్క సంతానం ఒకే వేడుకను చేసుకోవాలి. తలకొరివి పెట్టిన కొడుకు తన ఇస్తాను సారంగా చేసుకున్నప్పుడు పితృ దేవతల నుండి ఎన్నటికీ ఆశీర్వాదం పొందలేరు!

Comments

Popular posts from this blog

పుస్తకంలో నాకో పేజీ!