Posts

Showing posts from August, 2022

కొన్ని నిజాలు!

Image
ఒక్కోడిని వెనక్కి లాగినంత మాత్రాన  ఇంకో వంద సంవత్సరాలు ఏమి బతకవు కదా ఉన్న కొన్ని రోజులైనా  మనిషిలాగా బతుకు మనుషులతో బతుకు ఏది నీది కాదు ఏది నీతో రాదు గుర్తుపెట్టుకో నీతో అవసరం లేకపోతే నీ చుట్టూ ఎవరుండరని శాశ్వతం నువ్వు బతికిన తీరేనని పనిచేయకుండా ఏది ఆశించే తత్వం నాది కాదు గుర్తించే తనం నీ వ్యక్తిత్వంలో లేకపోతే ఎలా! నీకు అభినందించే మనస్సు లేనప్పుడు  ఆ అభినందనను నువ్వు కోరడం కూడా తప్పే! పరిచయాలన్ని గొప్పవేమీ కాదు అవి కాలక్రమంలో తెలుస్తాయి అంతే! గౌరవాన్ని కొరుకోకూడదు  కేవలం కాపాడుకోవాలి అది నిరంతర నీ ప్రవర్తనలోనే ఉంటుంది! వ్యక్తుల మధ్య వ్యత్యాసాలు డబ్బులో, పదవిలో అంటే నేనొప్పుకోను వ్యక్తుల మధ్య వ్యత్యాసాలంటే కేవలం వ్యక్తిత్వంలోనే! కాలాన్ని తోసుకుంటూ సాగాలి కొందరు జీవితంలో ఎలా బతకాలో నేర్పిస్తే కొందరు ఎలా బతకకూడదో నేర్పిస్తారు కొందరికి గుర్తించే గొప్ప మనస్సు ఉంటుంది కొందరికి దాన్ని ఒప్పుకునే మనస్సు ఉండదు వారి వారి జీవన విధానాలు కదా అలాగే ఉంటాయి ఏదేమైనా ఈ ఎముకల గూడు శాశ్వతం కానప్పుడు శాశ్వతంగా నిలిచే వాటికోసమే బతుకు! విలువలు ఉన్నవాల్లకే వాటిని గుర్తించే గొప్పతనం ఉంటుంది ...

ఇదే నిజం!

Image
డబ్బులు పోతాయ్ మనుషులు పోతారు బంధాలు పోతాయ్ కోటలు కూలుతాయ్ కాలం పోతుంది నువ్వు కూడా పోతావ్ మరి ఇక్కడ నీదనేది ఏది?  ఇప్పుడు నీ కళ్లముందున్న దృశ్యం నీ మెదడులో మెదిలే ఆలోచనలతో వ్యవస్థలోని అరాచక శక్తులపైన పోరాటం చేయ్ అంతేకాని ఓ బ్రతికున్న శవం లా ఉండకు బయటికి రా నీతో ఉన్న కాలం మాత్రమే నీది అది చూపించే దృశ్యం వినిపించే ధ్వని నిను తాకే స్పర్శ నువు పీల్చే గాలి నువు పొందే అనుభూతి, అదే నిజం ఆ నిజం లోనే బ్రతుకు...! ఇవన్నీ ఏం చెప్తున్నాయో ఎప్పుడన్నా ఆలోచించావా?  ఓ చోట ఆగకుండా ప్రయాణిస్తూనే ఉంటుంది కాలం అది ఉన్నప్పుడే అనుభవించాలి పోయాక ఏడ్చినా రాదు! అది నీకు ముందూ ఉంది నువు పోయాక కూడా ఉంటుంది మధ్యలో వచ్చి పోయేది నువ్వే లేని దాని గురించో రాని దాని గురించో, ఎక్కువగా ఆలోచించి ఇప్పుడు  నీతో ఉన్న కాలాన్ని కోల్పోకు! గతాన్ని తవ్వుతూ నీకంటే ముందు ఎంతో మంది వచ్చి పోయారు నీ తర్వాత వచ్చి నీకంటే ముందు పోతున్నారని ఆలోచిస్తూ, చింతిస్తూ విమర్శిస్తూ, వ్యంగ్యంగా మాట్లాడుతూ అక్కడే ఉండిపోకు ఎందుకంటే వేగం ఉన్న బండే ముందుకు ఉరుకుతుంది నీకంటే ముందు ఉరుకుతుంది వ్యవస్థకు ఆ ఉరుకుడే అవసరం గుర్తుంచుకో....! రేపే...

జీవితంలో కొందరు!?

Image
KNR గొప్పదారుల్లో గొప్పవారితో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మార్గంలో నడవలేనివారు అదిచూసి అభినందించలేని వారు కొందరుంటారు  మనతో మనలో ఇతరుల ముందు చులకన చేసి,తక్కువ చేసి మాట్లాడే వారు! అలా మాట్లాడితే ఆ క్షణం నువ్వు హీరో అవ్వచ్చు కానీ నువ్వెన్ని కట్టుకథలు చెప్పిన నీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో తెలియదు కానీ  నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారిపోతుంది ఒకానొక రోజు!  రాత్రి సూర్యుడు ఉదయించడు తెల్లవారులో సూర్యుడు అస్తమించడు కష్టాలకు కూడా తెలుసు నన్ను గెలవలేవని! గొప్పగా నిర్మించుకుంటున్న నా ఆస్తి నా వ్యక్తిత్వం! చస్తే గొప్పగానే చావాలి అలా కాకుండా ఏ విధంగా సచ్చిన  ఇన్ని రోజులు ఈ భూమి మోసిన శరీరానికి విలువ లేనట్లే! మార్గం మంచిదైతే నీతో ఉండేవాళ్ళు కొందరైనా స్పష్టమైన వాళ్ళే ఉంటారు! జననం నుండి మరణం దాకే కదా ఈ ప్రయాణం ఎందుకో మరి అహం ఇహం అంటూ కొందరు! మన ఆజ్ఞలో కూడా లేని  అలాంటి ఒకరోజు వచ్చినప్పుడు అస్పష్టంగా మనకే తెలియకుండా మరణం అనే అద్భుతమైన రోజుతో అప్పుడు వదిలివెల్లేదే నిజమైన సంపద! ఎంత గొప్పగా బతికిన  ఎవరో ఒకరి అల్పుల కథలో చెడుగానే ఉంటాము ఎందుకంటే శాశ్వతమైన జీవితం అంటే అర్...

ఏది నీది!

Image
జీవితంలో డబ్బు కోసమే బతుకుతూ పక్కవారిని మోసం చేస్తూ మంచివారిని కూడా చెడ్డవారిలాగా చిత్రీకరించి బురదలో బతుకుతున్న వారే చుట్టూ చేరి నవ్వుల పాలు అవుతున్నారు కొందరు వెర్రి జనాలు కొన్ని వెర్రి బంధాలు! చీకటయ్యే రోజు వచ్చినప్పుడు ఆరడుల జాగదగ్గర అవసరానికి మించి సంపాదించిన ఆస్తులు అవేమీ నీవెంట రాకుండా  ఆశాశ్వతమై ఇక్కడే ఉంటాయి! అవును ఒకరోజు ఏకాంతంగా నిశబ్ద మందిరంలో ఎన్నో తగాదాలు ఎన్నో పగలు ఎన్నో ద్వేషాలు అర్దం లేనివన్నీ శరీరంతో స్మశాన వాటికలో పాతిపెట్టబడుతాయి! కానీ పాతి పెట్టలేనిది గొప్పగా బతికిన తీరు వ్యక్తిత్వానికి అంటించుకోని మరకలు మాత్రమే కొన్ని రోజులు ఇక్కడ ఉంచబడతాయి ఒకానొక రోజు అవి కూడా చెరచి వేయబడతాయి కాలం మాత్రమే అన్నింటికీ సమాధానంగా ఉంటూ మనిషి జన్మకు అర్థాన్ని చెప్పే ప్రయత్నాలు చేస్తుంది కానీ మనిషి తెలుసుకోకుండా విర్రవీగుతూ  పగలు రాత్రి లెక్కనే సంచరిస్తూ ప్రయాణం చేస్తున్నాడు అర్దం లేకుండా! పుట్టుక మరణం మధ్యలో  సాగించే అద్భుతమైన ప్రయాణమే ఈ జీవితం అందుకే ఏది మనది కానప్పుడు ఏది మనతో రానప్పుడు చీకటయ్యే రోజు వరకు అధ్బుతంగా జీవిస్తూ వీడ్కోలు పలుకుదాం అవును గొప్పగా ఈ జీవితానికి వ...

రాష్ట్ర సాధనలో తెలంగాణ జాగృతి కీలక పాత్ర

Image
రాష్ట్ర సాధనలో తెలంగాణ గొప్పదనాన్ని చాటిచెప్పడానికి తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేసి యావత్ తెలంగాణ ప్రజలందరినీ మన ఆచారం, కట్టుబాట్లు, సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రచారం చేస్తూ హోరు హోరున ఉద్యమంలో మేధావులను జాగృతం చేస్తూ తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు బతుకమ్మ పాటలతో ఎక్కడికక్కడ పిల్లల నుండి పెద్దల వరకు  గ్రామాల నుండి పట్టణాల దాకా గల్లీ నుండి ఢిల్లీ దాకా అందరినీ ఏకం చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్నీ ఏర్పాటు చేసి ఆధిపత్య ధోరణి నుండి విముక్తి కలిగించడానికి నిత్యం  అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ ప్రజలందరి ఆత్మగౌరవం తలెత్తుకునెలా చేసిన  ముందుండి నడిపించిన కవితక్కకి నమస్కరిస్తూ తెలంగాణ జాగృతిలో భాగమై నా వంతుగా పనిచేస్తున్నందుకు గర్వపడుతూ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ  స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ గారికి జయంతి సంధర్భంగా నివాళులు తెలుపుతున్నాను! జై తెలంగాణ జై జాగృతి Kallem Naveen Reddy తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం కో కన్వీనర్ కామారెడ్డి జిల్లా 9963691692