కొన్ని నిజాలు!

ఒక్కోడిని వెనక్కి లాగినంత మాత్రాన 
ఇంకో వంద సంవత్సరాలు ఏమి బతకవు కదా
ఉన్న కొన్ని రోజులైనా 
మనిషిలాగా బతుకు
మనుషులతో బతుకు
ఏది నీది కాదు
ఏది నీతో రాదు
గుర్తుపెట్టుకో నీతో అవసరం లేకపోతే
నీ చుట్టూ ఎవరుండరని
శాశ్వతం నువ్వు బతికిన తీరేనని
పనిచేయకుండా ఏది ఆశించే తత్వం నాది కాదు
గుర్తించే తనం నీ వ్యక్తిత్వంలో లేకపోతే ఎలా!
నీకు అభినందించే మనస్సు లేనప్పుడు 
ఆ అభినందనను నువ్వు కోరడం కూడా తప్పే!
పరిచయాలన్ని గొప్పవేమీ కాదు
అవి కాలక్రమంలో తెలుస్తాయి అంతే!
గౌరవాన్ని కొరుకోకూడదు 
కేవలం కాపాడుకోవాలి
అది నిరంతర నీ ప్రవర్తనలోనే ఉంటుంది!
వ్యక్తుల మధ్య వ్యత్యాసాలు డబ్బులో, పదవిలో అంటే నేనొప్పుకోను
వ్యక్తుల మధ్య వ్యత్యాసాలంటే కేవలం వ్యక్తిత్వంలోనే!
కాలాన్ని తోసుకుంటూ సాగాలి
కొందరు జీవితంలో ఎలా బతకాలో నేర్పిస్తే
కొందరు ఎలా బతకకూడదో నేర్పిస్తారు
కొందరికి గుర్తించే గొప్ప మనస్సు ఉంటుంది
కొందరికి దాన్ని ఒప్పుకునే మనస్సు ఉండదు
వారి వారి జీవన విధానాలు కదా
అలాగే ఉంటాయి
ఏదేమైనా ఈ ఎముకల గూడు శాశ్వతం కానప్పుడు
శాశ్వతంగా నిలిచే వాటికోసమే బతుకు!
విలువలు ఉన్నవాల్లకే వాటిని గుర్తించే గొప్పతనం ఉంటుంది
సింహం చెంత సింహమే ఉంటుంది 
అలాగే గొర్రెల చెంత గొర్రెలే ఉంటాయి కదా!
నిన్న లెక్క నేడు లేవు
నేడు లెక్క రేపు ఉండవు
తాత్కాలిక మాటలతో
ఎవరిని తక్కువ చేసి మాట్లాడకు
కాలం నీకంటే వేగం
పదునైన కత్తిని కూడా మొండి చేస్తుంది
వ్యవస్థలో ఉంటూ వ్యవస్థ కోసమే పనిచేయాలి!

Kamareddy
9963691692

Comments

Popular posts from this blog

తండ్రి సంవత్సరిక విధానం....!!

పుస్తకంలో నాకో పేజీ!