ఇదే నిజం!
డబ్బులు పోతాయ్
మనుషులు పోతారు
బంధాలు పోతాయ్
కోటలు కూలుతాయ్
కాలం పోతుంది
నువ్వు కూడా పోతావ్
మరి ఇక్కడ నీదనేది ఏది?
ఇప్పుడు నీ కళ్లముందున్న దృశ్యం
నీ మెదడులో మెదిలే ఆలోచనలతో
వ్యవస్థలోని అరాచక శక్తులపైన
పోరాటం చేయ్
అంతేకాని
ఓ బ్రతికున్న శవం లా ఉండకు
బయటికి రా
నీతో ఉన్న కాలం మాత్రమే నీది
అది చూపించే దృశ్యం
వినిపించే ధ్వని
నిను తాకే స్పర్శ
నువు పీల్చే గాలి
నువు పొందే అనుభూతి, అదే నిజం
ఆ నిజం లోనే బ్రతుకు...!
ఇవన్నీ ఏం చెప్తున్నాయో ఎప్పుడన్నా ఆలోచించావా?
ఓ చోట ఆగకుండా ప్రయాణిస్తూనే ఉంటుంది కాలం అది ఉన్నప్పుడే అనుభవించాలి
పోయాక ఏడ్చినా రాదు!
అది నీకు ముందూ ఉంది
నువు పోయాక కూడా ఉంటుంది
మధ్యలో వచ్చి పోయేది నువ్వే
లేని దాని గురించో
రాని దాని గురించో, ఎక్కువగా ఆలోచించి
ఇప్పుడు
నీతో ఉన్న కాలాన్ని కోల్పోకు!
గతాన్ని తవ్వుతూ
నీకంటే ముందు ఎంతో మంది వచ్చి పోయారు
నీ తర్వాత వచ్చి నీకంటే ముందు పోతున్నారని
ఆలోచిస్తూ, చింతిస్తూ
విమర్శిస్తూ, వ్యంగ్యంగా మాట్లాడుతూ
అక్కడే ఉండిపోకు
ఎందుకంటే
వేగం ఉన్న బండే ముందుకు ఉరుకుతుంది
నీకంటే ముందు ఉరుకుతుంది
వ్యవస్థకు ఆ ఉరుకుడే అవసరం
గుర్తుంచుకో....!
రేపేంటి?
ఎల్లుండి ఏంటి?
పదేళ్ల తర్వాత ఏంటి?
అని కాదు, ఈరోజేంటి?
ఇప్పుడేంటి?
ఇప్పుడు నీతో ఉన్న క్షణం ఏంటి?
దాన్ని నువ్వు ఏం చేస్తున్నావ్?
అనేది ముఖ్యం
ఓ బ్రతికున్న శవం లా ఉండకు
బయటికి రా
రేపటి భవిష్యత్ కోసం
నీ ఆలోచనలకు జీవం పోస్తూ!
(చర్చించాల్సింది ఫోటో గురించి కాదు రాయబడ్డ అక్షరాల గురించి)
Kallem Naveen Reddy (Facebook I'd)
Kamareddy
Comments
Post a Comment