జీవితంలో కొందరు!?
KNR
గొప్పదారుల్లో
గొప్పవారితో
ప్రయాణం చేస్తున్నప్పుడు
ఆ మార్గంలో నడవలేనివారు
అదిచూసి అభినందించలేని వారు
కొందరుంటారు
మనతో
మనలో
ఇతరుల ముందు
చులకన చేసి,తక్కువ చేసి మాట్లాడే వారు!
అలా మాట్లాడితే ఆ క్షణం నువ్వు హీరో అవ్వచ్చు
కానీ నువ్వెన్ని కట్టుకథలు చెప్పిన
నీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో
తెలియదు కానీ
నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారిపోతుంది ఒకానొక రోజు!
రాత్రి సూర్యుడు ఉదయించడు
తెల్లవారులో సూర్యుడు అస్తమించడు
కష్టాలకు కూడా తెలుసు
నన్ను గెలవలేవని!
గొప్పగా నిర్మించుకుంటున్న నా ఆస్తి నా వ్యక్తిత్వం!
చస్తే గొప్పగానే చావాలి
అలా కాకుండా ఏ విధంగా సచ్చిన
ఇన్ని రోజులు ఈ భూమి మోసిన శరీరానికి విలువ లేనట్లే!
మార్గం మంచిదైతే నీతో ఉండేవాళ్ళు కొందరైనా స్పష్టమైన వాళ్ళే ఉంటారు!
జననం నుండి మరణం దాకే కదా ఈ ప్రయాణం
ఎందుకో మరి అహం ఇహం అంటూ కొందరు!
మన ఆజ్ఞలో కూడా లేని
అలాంటి ఒకరోజు వచ్చినప్పుడు
అస్పష్టంగా మనకే తెలియకుండా
మరణం అనే అద్భుతమైన రోజుతో
అప్పుడు వదిలివెల్లేదే నిజమైన సంపద!
ఎంత గొప్పగా బతికిన
ఎవరో ఒకరి అల్పుల కథలో చెడుగానే ఉంటాము
ఎందుకంటే శాశ్వతమైన జీవితం అంటే అర్ధం తెలియని అల్పులు కదా!
By
KALLEM NAVEEN REDDY
KAMAREDDY
Comments
Post a Comment