Posts

Showing posts from September, 2022

మనకో శత్రువు ఉండాలి!

Image
నీలాగా జీవించలేని నీలాగా బ్రతకలేని నీలాగా ఆలోచించలేని నీదారిని భరించలేని ఒక శత్రువైన ఉండాలి అవును మనకో శత్రువు ఉండాలి ఆశాశ్వతమైన వ్యక్తిత్వాలు కదా జన్మించడం, జీవించడం, మరణించడం   "చివరిది" అంటే అర్దం తెలియని అల్పులు మనలో మనతో ఒక్కడైనా ఉంటాడు నువ్వు బాధపడితే నవ్వేవాడు నువ్వు నవ్వితే ఏడ్చేవాడు అలాంటి శత్రువు ఒకడు ఉండాలి! నా విలువ తెలియకపోవచ్చు ఇప్పుడు కానీ తెలిసేలోపు మీకు విలువ ఉండదని గమనించు అక్షరాలే నా నేస్తాలు అక్షరాలే నా ఆస్తులు ఇక్కడ కొందరు  అనర్హులు అర్హులు అర్హులు అనర్హులు! మరుక్షణం మరణం అయిన సంభవించవచ్చు ఆగిపోయే జీవితాలు ఆకాశంలోకి చూడు ఒకసారి ఇంత విశాలమైన సామ్రాజ్యంలో ఎంత కుంచించుకు పోతున్నావో జీవించు గొప్ప ఆలోచనలతో గొప్ప ఆచరణలతో! ఆది నుండి ఆకాశం మూగదీ అనాదిగా తల్లి ధరణి మూగదీ నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు ఈ నడమంత్రపు మనుషులకే   మాటలు ఇన్ని మోసాలు తెలిసి మసలుకోండి సన్నిహితులారా.....!! ఈ సమాజంలో మనయొక్క మాటలు మనయొక్క రాతలు మనల్ని నలుగురుకి పరిచయం మాత్రమే చేస్తాయి కానీ మన " ఉన్నతమైన వ్యక్తిత్వం" మాత్రమే మనకు అందరు దగ్గరయ్యేలా చేస్తుంది వ్యక్తిత్వం నిలబెట్టుకో...

బతికేదెందుకు చాన్నాళ్లు!

Image
అశాశ్వతమైన జీవితంలో  భోగ భాగ్యాలు కావాలనే ఆశ లేదు  కానీ ఈ శరీరంలో చలనం ఉన్నంతవరకు  ఈ దరణిపై కొన్ని విలువలతో జీవిస్తూ అందంగా పనిచేస్తూ కొందరికి కొన్ని విలువలను పరిచయం చేస్తూ జీవించడమే! జన్మించడం ఒక్క క్షణం మరణించడం ఒక్క క్షణం కానీ జీవించడం మాత్రం సులభమేమి కాదు అది నిరంతర సాధనలో ఉంటుంది! వ్యక్తిత్వం పైన అంటించుకున్న మరకలు ప్రాణం పోయినా కూడా పోవు అందుకే గొప్పగా జీవించాలి గడిచిన సమయం తిరిగిరాదు గడుస్తున్న కాలం ఎవరికోసం ఆగదు కాలం నిరంతర ప్రవాహం! జీవితం అంటే జన్మించడం మరణించడం మద్యలో ఉండే జీవించడమే కదా ఇదర్దం అయితే మనిషి మహర్షి అవుతాడు గొప్పగా ఆలోచిస్తాడు గొప్పగా ఆలోచిస్తూ గొప్పగా పనిచేస్తూ వ్యవస్థతో మమేకమై సంచరిస్తాడు! అవును  బతికేదెందుకు చాన్నాళ్లు మరణపు అంచులను తాకడానికి నిత్య నూతనంగా జీవిస్తూ  శాశ్వతమైన ఆలోచనలతో  బతికున్నప్పుడే జీవించి ఉండే పనులను చేస్తూ! Kallem Naveen Reddy

నేనున్నా నవీన్ వచ్చేయ్!!Always Welcome!!

Image
గత వారం రోజులుగా టైఫాయిడ్ జ్వరంలో బాధపడుతున్న! ఇదే విషయాన్ని మూడు రోజుల క్రితం ఫేస్బుక్ పోస్ట్ లో చెప్పాను! దీన్ని గమనించిన శ్రీరామ్ అన్న ఈరోజు నన్ను క్లినిక్ కి పిలుపించుకుని దాదాపుగా ఆరు గంటలు స్పెషల్ కేర్ తీసుకుని ట్రీట్మెంట్ చేశాడు! Platelets Count కూడా ఈరోజు పెరిగింది! రెండు గ్లూకోజ్ లు పెట్టాడు! ఇంజక్షన్స్ ఇచ్చాడు! అంతకంటే ముఖ్యమైన బూస్టర్ డోస్ లాంటి మాటలు చెప్పాడు! అవి మందులతో పాటు రోగాన్ని నయం చేయడంలో ప్రముఖ పాత్ర వహించాయి! విలువైన మెడిసిన్ తో చికిత్స చేసి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు! తీసుకోండి అన్న అని ఎంత అన్నకాని తీసుకోలేదు! పైగా గ్లూకోజ్ పెట్టిన మద్యలో మద్యలో తినడానికి ఫ్రూట్స్, మక్క కంకి ఇంకా అలా ఇచ్చాడు! ఇంజక్షన్ ఇచ్చేముందు రియాక్షన్ అవుతుందో లేదో టెస్ట్ చేశాడు! నేరుగా కలిసింది మొదటిసారి కానీ మా మధ్య పరిచయం చాలాకాలం నుండి! నాకర్ధం అయిన విషయం ఏంటంటే ఒక అక్షరం విలువ ఒక అక్షరానికి తెలియడం అది ఈరోజు ఇలా అయ్యింది! మేమెప్పుడో కలవాల్సింది కానీ కొన్ని పనుల వల్ల కలవలేదు! ఎప్పుడు కలుద్దాం అనుకున్న ఇద్దరికీ సెట్ కాలేదు కానీ ఇలాంటి సందర్భంలో కలిశాము నవీన్ అని శ్రీరామ్ అన్న అన్నాడు! అ...

గజల్!

తెరచాటు నాటకాలు మాయమవును ఒకనాడు! పూలపాన్పుల జీవితాలు మాయమవును ఒకనాడు!! నిందలేసే బంధాలను నిలదీస్తూ సాగిపో! మేడల నీడలలో నీనీడ దూరమవును ఒకనాడు!! మార్చలేని గతాలను ఆలోచిస్తూ ఉండిపోకు! మార్చలేని నీ వ్యక్తిత్వం వెలిగిపోవును ఒకనాడు!! గాయాలకు గేయాలై గెంతులేస్తూ గెలవాలి! గమ్యానికి నువ్వే ఒక మార్గమవును ఒకనాడు!! అసలు మనిషి మనసులను గెలవడమే గొప్ప "నవీన్"! నువ్వు బతికిన తీరు చరిత్రై నిలుచును ఒకనాడు!! ------------------------------------------------------ వ్యవస్థలో మమేకమై పనిచేస్తున్నప్ప్పుడు నలుగురి ప్రేమలను అభిమానాన్ని పొందటం చూడలేని వ్యక్తులు కేవలం తెరచాటు మాత్రమే మాట్లాడతారు కానీ ఇంకా గొప్పగా పనిచేయాలని అనుకోరు వ్యవస్థలో ఇలాంటి వాళ్ళే ఎక్కువగా తారసపడుతున్నారు అందుకే నేనెక్కువ ఎవరితో మాట్లాడను కానీ నేను మాట్లాడేది స్పష్టమైన వారే ఉంటారు  అశాశ్వతమైన వ్యక్తులకు వ్యక్తిత్వాలకు దూరంగా పనిచేసుకుంటూ నాదైన బాటలో సాగుతాను సమాజంతో మాట్లాడిస్తాను చర్చ జరిగేలా చేస్తాను ప్రపంచమంతా నిషబ్దమై నిద్రపోతున్న  రాత్రి సమయంలో మెలుకువై కవినై ఉదయిస్తాను అక్షరాలతో కొన్ని హృదయాలను మేల్కొలుపుతాను! నాపై మాటల తూటాలు...