మనకో శత్రువు ఉండాలి!
నీలాగా జీవించలేని
నీలాగా బ్రతకలేని
నీలాగా ఆలోచించలేని
నీదారిని భరించలేని
ఒక శత్రువైన ఉండాలి
అవును మనకో శత్రువు ఉండాలి
ఆశాశ్వతమైన వ్యక్తిత్వాలు కదా
జన్మించడం, జీవించడం, మరణించడం
"చివరిది" అంటే అర్దం తెలియని అల్పులు
మనలో మనతో ఒక్కడైనా ఉంటాడు
నువ్వు బాధపడితే నవ్వేవాడు
నువ్వు నవ్వితే ఏడ్చేవాడు
అలాంటి శత్రువు ఒకడు ఉండాలి!
నా విలువ తెలియకపోవచ్చు ఇప్పుడు
కానీ తెలిసేలోపు
మీకు విలువ ఉండదని గమనించు
అక్షరాలే నా నేస్తాలు
అక్షరాలే నా ఆస్తులు
ఇక్కడ కొందరు
అనర్హులు అర్హులు
అర్హులు అనర్హులు!
మరుక్షణం మరణం అయిన సంభవించవచ్చు
ఆగిపోయే జీవితాలు
ఆకాశంలోకి చూడు ఒకసారి
ఇంత విశాలమైన సామ్రాజ్యంలో
ఎంత కుంచించుకు పోతున్నావో
జీవించు
గొప్ప ఆలోచనలతో
గొప్ప ఆచరణలతో!
ఆది నుండి
ఆకాశం మూగదీ
అనాదిగా తల్లి
ధరణి మూగదీ
నడుమ వచ్చి
ఉరుముతాయి
మబ్బులు
ఈ నడమంత్రపు మనుషులకే
మాటలు
ఇన్ని మోసాలు
తెలిసి మసలుకోండి సన్నిహితులారా.....!!
ఈ సమాజంలో
మనయొక్క మాటలు
మనయొక్క రాతలు
మనల్ని నలుగురుకి పరిచయం
మాత్రమే చేస్తాయి
కానీ
మన " ఉన్నతమైన వ్యక్తిత్వం"
మాత్రమే మనకు
అందరు దగ్గరయ్యేలా చేస్తుంది
వ్యక్తిత్వం నిలబెట్టుకోవడం
అంత సులువైన పనేమీ కాదు
బయట శక్తులు మనల్ని మనలా
ఉండనివ్వవు కదా
మిత్రుడిలా ఉండే శత్రువు రూపంలో!!
అభ్యుదయ కవి
సోమారం పేట్
మాచారెడ్డి
కామారెడ్డి
9963691692
Comments
Post a Comment