నేనున్నా నవీన్ వచ్చేయ్!!Always Welcome!!
గత వారం రోజులుగా టైఫాయిడ్ జ్వరంలో బాధపడుతున్న! ఇదే విషయాన్ని మూడు రోజుల క్రితం ఫేస్బుక్ పోస్ట్ లో చెప్పాను! దీన్ని గమనించిన శ్రీరామ్ అన్న ఈరోజు నన్ను క్లినిక్ కి పిలుపించుకుని దాదాపుగా ఆరు గంటలు స్పెషల్ కేర్ తీసుకుని ట్రీట్మెంట్ చేశాడు! Platelets Count కూడా ఈరోజు పెరిగింది! రెండు గ్లూకోజ్ లు పెట్టాడు! ఇంజక్షన్స్ ఇచ్చాడు! అంతకంటే ముఖ్యమైన బూస్టర్ డోస్ లాంటి మాటలు చెప్పాడు! అవి మందులతో పాటు రోగాన్ని నయం చేయడంలో ప్రముఖ పాత్ర వహించాయి! విలువైన మెడిసిన్ తో చికిత్స చేసి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు! తీసుకోండి అన్న అని ఎంత అన్నకాని తీసుకోలేదు! పైగా గ్లూకోజ్ పెట్టిన మద్యలో మద్యలో తినడానికి ఫ్రూట్స్, మక్క కంకి ఇంకా అలా ఇచ్చాడు! ఇంజక్షన్ ఇచ్చేముందు రియాక్షన్ అవుతుందో లేదో టెస్ట్ చేశాడు! నేరుగా కలిసింది మొదటిసారి కానీ మా మధ్య పరిచయం చాలాకాలం నుండి! నాకర్ధం అయిన విషయం ఏంటంటే ఒక అక్షరం విలువ ఒక అక్షరానికి తెలియడం అది ఈరోజు ఇలా అయ్యింది! మేమెప్పుడో కలవాల్సింది కానీ కొన్ని పనుల వల్ల కలవలేదు! ఎప్పుడు కలుద్దాం అనుకున్న ఇద్దరికీ సెట్ కాలేదు కానీ ఇలాంటి సందర్భంలో కలిశాము నవీన్ అని శ్రీరామ్ అన్న అన్నాడు! అప్పుడు నాకనిపించింది నేనున్నా నవీన్ వచ్చేయ్ అని అన్నప్పుడు ఆ ప్రేమలో ఎంత స్నేహం ఉందోనని! ఇక్కడ స్నేహానికి వయస్సు ప్రధానం కాదు ప్రేమే ప్రధానం! కొన్ని కొన్ని సందర్భాలు కచ్ఛితంగా చెప్పుకోవాల్సినవి ఉంటాయి! అలాంటిదే ఇది! వారం నుండి హాస్పిటల్ ఉంటూ బాధపడుతూ ఈరోజు శ్రీరామ్ అన్న దగ్గరికి రాగానే రిలీఫ్ గా ఉంది! Thank You Sriram Anna❤️❤️!
Thank you naveen
ReplyDelete