గజల్!



తెరచాటు నాటకాలు మాయమవును ఒకనాడు!
పూలపాన్పుల జీవితాలు మాయమవును ఒకనాడు!!

నిందలేసే బంధాలను నిలదీస్తూ సాగిపో!
మేడల నీడలలో నీనీడ దూరమవును ఒకనాడు!!

మార్చలేని గతాలను ఆలోచిస్తూ ఉండిపోకు!
మార్చలేని నీ వ్యక్తిత్వం వెలిగిపోవును ఒకనాడు!!

గాయాలకు గేయాలై గెంతులేస్తూ గెలవాలి!
గమ్యానికి నువ్వే ఒక మార్గమవును ఒకనాడు!!

అసలు మనిషి మనసులను గెలవడమే గొప్ప "నవీన్"!
నువ్వు బతికిన తీరు చరిత్రై నిలుచును ఒకనాడు!!

------------------------------------------------------
వ్యవస్థలో మమేకమై పనిచేస్తున్నప్ప్పుడు నలుగురి ప్రేమలను అభిమానాన్ని పొందటం చూడలేని వ్యక్తులు కేవలం తెరచాటు మాత్రమే మాట్లాడతారు కానీ ఇంకా గొప్పగా పనిచేయాలని అనుకోరు
వ్యవస్థలో ఇలాంటి వాళ్ళే ఎక్కువగా తారసపడుతున్నారు
అందుకే
నేనెక్కువ ఎవరితో మాట్లాడను
కానీ నేను మాట్లాడేది స్పష్టమైన వారే ఉంటారు 
అశాశ్వతమైన వ్యక్తులకు వ్యక్తిత్వాలకు దూరంగా
పనిచేసుకుంటూ నాదైన బాటలో సాగుతాను
సమాజంతో మాట్లాడిస్తాను
చర్చ జరిగేలా చేస్తాను
ప్రపంచమంతా నిషబ్దమై నిద్రపోతున్న 
రాత్రి సమయంలో మెలుకువై కవినై ఉదయిస్తాను
అక్షరాలతో కొన్ని హృదయాలను మేల్కొలుపుతాను!

నాపై మాటల తూటాలు 
విసురుదామని చూస్తున్నారేమో
ఇనుపకవచం కన్నా జఠిలమైనది 
నా మనోబలం
వెనుతిరిగి నేలరాలాల్సిందే 
మీ సమయం.!

కథలల్లి కాలక్షేపం చేస్తున్నారేమో
రవ్వంతైనా నా మోమున 
చిరునవ్వును చెరపలేదు 
మీ ప్రతిఫలం!

నా ప్రపంచం నిత్యవాసంతపు విరివనం
నిత్యం ఎన్నో పదాల మాలలల్లుకుంటాను
ఆ పరిమళాలను ఆఘ్రాణిస్తూ 
పరవశమౌతాను!

నా నిత్యజీవనం సమస్యల వెంట పయనం
అలల ఊయలపై కదలాడే 
ఆశల సరాగం!

ఇక నా గమ్యం
మీరు సాగించలేని పయనం
మీరు ఎన్నటికీ చేరలేని తీరం!

అభ్యుదయ కవి
తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం
కామారెడ్డి జిల్లా
9963691692

Comments

Post a Comment

Popular posts from this blog

తండ్రి సంవత్సరిక విధానం....!!

పుస్తకంలో నాకో పేజీ!