Posts

Showing posts from January, 2021

శాశ్వతం అంటే ఇదేరా అయ్యా!

Image
పుట్టడం  చావడం ఒక క్షణం మాత్రమే కానీ  జీవించడం మాత్రం ఒక యాగం! ఎవరైనా పుడతారు ఎవరైనా పోతారు కానీ జీవించడం మాత్రం!? అవును కొంతమందే  ఇక్కడ నిలుస్తారు! సచ్చాక కూడా జీవించే ఉంటారు! అందులో నువ్వుంటావా అనేదే నీ పుట్టుకకు అర్దం పరమార్థం! ఇలా కాకుండా నువ్వేలా బతికిన అది వ్యర్ధమే రా అయ్యా! అభ్యుదయ కవి కళ్లెం నవీన్ రెడ్డి సోమారం పేట్ మాచారెడ్డి కామారెడ్డి జిల్లా 9963691692

కొందరిని చూశాక...!

కొంత కాలం బతకాలంటే వంద రకాలుగా బతకాలి ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కోల ఉన్నారు నువ్వు ఒకేలా ఉంటే ఒంటరిని చేస్తూ తొక్కేస్తారు అందుకే వాళ్ళని బట్టి నువ్వు మారాలి నిజాయితీ అనేది లేనొడికి దాని విలువ తెలియదుగా వాని ముందు అది వ్యర్దం వాడి ముందు వాడిలాగే ఉండాలి మార్చాలని ప్రయత్నించిన కానీ నిజాయితీ గల వ్యక్తుల్నే చెడు చేస్తున్నారు కాలంతో పాటు అహం, ఇహం ఇలా అన్ని మాయం అవుతాయి "కొండిగాళ్లు" దీన్ని ఎరుగక బతుకుతున్నారు కానీ మనిషి లోని మర్మం  దాని అంచుల ఉన్న వక్రబుద్ధి ఎన్నో వికృత రూపాలను సంతరించుకుని  చెడు వ్యక్తులవైపు ఆరాటపడుతున్నారు మంచి వ్యక్తులను మోసం చేస్తూ అవును ఏదోలా ఒకోలా బతకాలి అనేవాళ్ళు కదా అలాగే ఉంటారు ఎందుకు బతుకుతున్నాం  అనేది చింతన లేదు పుడతారు చస్తారు మధ్యలో నీ యొక్క తత్వం పైనే ఆధారపడి ఉంటుంది అసలైన పేరుకు ఆస్తులు.... పోయేటప్పుడు  ఎలా పోతున్నామో అవే నీ ఇన్ని రోజుల బతుకుకు అర్దం ఇకనైనా మారండి మంచిని మంచి అనండి చెడుని చెడు అనండి కానీ మంచిని చెడు చేస్తే చివరగా మిగిలేది నీకు సమాజంలో చెడు వ్యక్తిగా గుర్తింపు మాత్రమే చెడుగా బతకాలి అంటే ఎలాగైనా బతకచ్చు కానీ మంచి వ్యక్తిగా...

ఒకటుంది

ఓరయ్య వినుకొరా! మనం చనిపోయాక ముట్టుడంటారు ముక్కు మూసుకుంటారు కాల్చేస్తారు పూడ్చేస్తారు మనదేది లేకుండా చేసి అన్ని తగులబెడతారు కానీ  మరణం లేనిది  తగులబెట్టలేనిది ఒకటుంది రా అయ్యా అదే శాశ్వతమైన "పేరు" ఇది కేవలం వ్యక్తిత్వం పైననే  అతని తత్వం పైననే ఆధారపడి ఉంటుందిరా అయ్యా! నవీన్ రెడ్డి అభ్యుదయ కవి 9963691692