కొందరిని చూశాక...!

కొంత కాలం బతకాలంటే
వంద రకాలుగా బతకాలి
ఎందుకంటే ఇక్కడ
ఒక్కొక్కరు
ఒక్కోల ఉన్నారు
నువ్వు ఒకేలా ఉంటే
ఒంటరిని చేస్తూ
తొక్కేస్తారు
అందుకే వాళ్ళని బట్టి నువ్వు మారాలి
నిజాయితీ అనేది
లేనొడికి దాని విలువ తెలియదుగా
వాని ముందు అది వ్యర్దం
వాడి ముందు వాడిలాగే ఉండాలి
మార్చాలని ప్రయత్నించిన కానీ
నిజాయితీ గల వ్యక్తుల్నే చెడు చేస్తున్నారు
కాలంతో పాటు
అహం, ఇహం ఇలా అన్ని మాయం అవుతాయి "కొండిగాళ్లు"
దీన్ని ఎరుగక బతుకుతున్నారు
కానీ మనిషి లోని మర్మం 
దాని అంచుల ఉన్న వక్రబుద్ధి
ఎన్నో వికృత రూపాలను సంతరించుకుని 
చెడు వ్యక్తులవైపు ఆరాటపడుతున్నారు
మంచి వ్యక్తులను మోసం చేస్తూ
అవును ఏదోలా ఒకోలా బతకాలి అనేవాళ్ళు కదా అలాగే ఉంటారు
ఎందుకు బతుకుతున్నాం 
అనేది చింతన లేదు
పుడతారు
చస్తారు
మధ్యలో నీ యొక్క తత్వం పైనే ఆధారపడి ఉంటుంది అసలైన పేరుకు ఆస్తులు....
పోయేటప్పుడు 
ఎలా పోతున్నామో
అవే నీ ఇన్ని రోజుల బతుకుకు అర్దం
ఇకనైనా మారండి
మంచిని మంచి అనండి
చెడుని చెడు అనండి
కానీ మంచిని చెడు చేస్తే
చివరగా మిగిలేది నీకు సమాజంలో చెడు వ్యక్తిగా గుర్తింపు మాత్రమే
చెడుగా బతకాలి అంటే ఎలాగైనా బతకచ్చు
కానీ మంచి వ్యక్తిగా ఉండాలి అంటే అంత సులువు ఏం కాదు
మంచిగా ఉన్న ఓర్వలేని వాళ్ళే 
నీ చుట్టూ చేరి మార్చాలని చూస్తారు
చెడు చేయాలని చూస్తారు
అబ్బబ్బో రంగులు మార్చే మనుషులు
ఇప్పుడున్నదే చూసుకునే మురిసే మేదావుల్లారా శాశ్వత చిరునామా కోసం
అరాటపడండి
ప్రతి చోట ఓ కొండిగాడు ఉంటాడు
ఆ కొండి గాల్లకు కచ్చితంగా కొండి పడుతుంది
కర్మపలితం అనే రూపంలో 
పోయేలోపు కచ్చితంగా చూసే పోతారు
ఇది యధార్థం......
కొందరు"కొండి" గాళ్లను చూశాక రాసింది ఇది.
👇👇👇👇👇👇👇👇👇
ఒక్కమాట
మహాభారతంలో శకుని మేధస్సు చాలా గొప్పది కానీ ఆ మేధస్సును చెడు వైపుకి ఉపయోగించడం వల్ల చరిత్రలో ఒక కుటీల బుద్ది, ఎన్నో వికృత కుతంత్రాలు చేసిన వాడిగా గుర్తింపు పొందాడు. అదే ఆ మేధస్సును మంచి వైపు ఉపయోగించి ఉంటే చరిత్రలో అతని పేరు ఒక గొప్ప మేధస్సు గల వ్యక్తిగా గుర్తింపు ఉండేది.
🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕

కేవలం ఇక్కడ మనము వదిలి వెళ్ళేది మంచిపేరు,చెడ్డపేరు అంతే...
ఇది తెలియకె మనుషులు అలా బతుకుతున్నారు.
అందరూ పుడతారు
అందరూ మరణిస్తారు
కానీ నిజాయితీగా జీవించడం అంతా సులువు కాదు.

By
నవీన్ రెడ్డి
అభ్యుదయ కవి
9963691692

Comments

Popular posts from this blog

తండ్రి సంవత్సరిక విధానం....!!

పుస్తకంలో నాకో పేజీ!