శాశ్వతం అంటే ఇదేరా అయ్యా!
పుట్టడం
చావడం
ఒక క్షణం మాత్రమే
కానీ
జీవించడం మాత్రం
ఒక యాగం!
ఎవరైనా పుడతారు
ఎవరైనా పోతారు
కానీ
జీవించడం మాత్రం!?
అవును
కొంతమందే
ఇక్కడ
నిలుస్తారు!
సచ్చాక కూడా జీవించే ఉంటారు!
అందులో
నువ్వుంటావా అనేదే
నీ పుట్టుకకు అర్దం
పరమార్థం!
ఇలా కాకుండా
నువ్వేలా బతికిన
అది వ్యర్ధమే రా అయ్యా!
అభ్యుదయ కవి
కళ్లెం నవీన్ రెడ్డి
సోమారం పేట్
మాచారెడ్డి
కామారెడ్డి జిల్లా
9963691692
Comments
Post a Comment