ఒకటుంది
ఓరయ్య
వినుకొరా!
మనం చనిపోయాక
ముట్టుడంటారు
ముక్కు మూసుకుంటారు
కాల్చేస్తారు
పూడ్చేస్తారు
మనదేది లేకుండా చేసి
అన్ని తగులబెడతారు
కానీ
మరణం లేనిది
తగులబెట్టలేనిది
ఒకటుంది రా అయ్యా
అదే శాశ్వతమైన "పేరు"
ఇది కేవలం వ్యక్తిత్వం పైననే
అతని తత్వం పైననే
ఆధారపడి ఉంటుందిరా అయ్యా!
నవీన్ రెడ్డి
అభ్యుదయ కవి
9963691692
Comments
Post a Comment