జీవితం ========= “మనిషి పుట్టిన దగ్గర నుండి మరణించే వరకు మధ్యలో సాగించే ప్రయాణమే జీవితం” ఈ లోకంలో ప్రతి ఒక్కరికీ అత్యంత ప్రధానమైనది తమ యొక్క జీవితం. జీవితంలో అన్ని సవ్యంగా సాగాలనే అనుకుంటారు. మరి ఎందుకు సాగడం లేదు? జీవితంలో అందరూ గొప్పవారు కావాలనుకుం కొందరే ఎందుకు గొప్పవారు అవుతారు? కారణమేమిటి? జీవితంలో అన్నీ కచ్చితమైన ప్రణాలికలు వేసుకొని చేస్తారు. కాని మొత్తం జీవితం గురించి ప్రణాళిక వేసుకోన్నారా? ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ దుఖాలు, గెలుపు ఓటములు, లాభనష్టాలు ఇమిడివుంటాయి. ప్రతి ఒక్కరి జీవితం ఎవరికి వారిది ప్రత్యేకమైనదే, ప్రతి పరిస్థితి ప్రత్యేకమైనదే కాబట్టి అన్ని వేళలలో అన్నింటికీ సిద్దంగాఉండాలి. జీవితం ఒక ఆట – ఆడి గెలువు జీవితం ఒక ప్రయాణం – కొనసాగించు జీవితం ఒక యుద్ధం – పోరాడి గెలువు జీవితం ఒక బహుమానం – స్వీకరించు జీవితం ఒక రహస్యం – పరిశోధించు జీవితం ఒక నాటకం – నీ పాత్రను ప్రదర్శించు జీవితం ఒక చాలెంజ్ – ధైర్యంగా ఎదుర్కో ”జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోయినా గెలవడానికి మరో అవకాశం ఉంటుంది” వెనకడుగు వేయకు – ...