పేరు లిఖించేలా బతికిపో
![]() |
✍️కె.ఎన్.ఆర్✍️ |
నిన్న లెక్క నేడు లేవు
నేడు లెక్క రేపు ఉండవు
తాత్కాలిక మాటలతో
ఎవరిని తక్కువ చేసి మాట్లాడకు
కాలం నీకంటే వేగం
పదునైన కత్తిని కూడా మొండి చేస్తుంది
యుగాలు గడిచాయి
రాజులు పోయారు
రాజ్యాలు పోయాయి
మేడలు
మిద్దెలు
ఇవన్నీ పోతాయి
మరెందుకు
అర్థం లేని అవకాశవాద జీవితం
వీలైతే గొప్పగా బతికిపో
పేరుని లిఖించేలా
By
నవీన్ రెడ్డి
అభ్యుదయ కవి
Comments
Post a Comment