గుండె బరువు | ఆకలి అరుపు

✍️కె.ఎన్.ఆర్✍️



కంటినుండి రాలిన చుక్కల భాద బరువెంతో
రైతు చెమట చుక్కల ఆకలి అరుపెంతో!!

గాయపడిన మనిషి గుండె లోతెంతో
కొలవ లేము దాన్ని ఏ మనసుతో, ఏ మనిషితో!!

ఎండిన డొక్కలు ఆకలి రుచులు ఎరుగవులే
మనసు పడే వ్యద ఎవరూ కనరులే!!

పుస్తకాలు తిను చెదలకు చదువు విలువ తెలిసేనా
నీడల నీడలలో వెలుగు విలువ తెలిసేనా!!

అవసరాల స్నేహాలకు చెలిమి విలువ తెలిసేనా
అబద్ధపు మాటలకు నిజం విలువ తెలిసేనా!!

యుగాలెన్ని గడిచినవో ఈ యుగాన
మరి ఏ యుగానా భయపడని మార్గమే
"కె.ఎన్.ఆర్"!!

By
నవీన్ రెడ్డి
అభ్యుదయ కవి
9963691692







Comments

Post a Comment

Popular posts from this blog

తండ్రి సంవత్సరిక విధానం....!!

పుస్తకంలో నాకో పేజీ!