Posts

Showing posts from September, 2024

తండ్రి సంవత్సరిక విధానం....!!

శ్రాధ్ కర్మ అనేది శ్రాధ్ కర్మ అనేది సంవత్సరికం విధానం , ఇది ఎంతో భాధ్యత గా చేసుకోవాల్సి ఉంటుంది. మాసికం, విమోకం మరియు పరమాత్మ అబ్దికం నవగ్రహ శాంతి పూజలు కుటుంబం లోని సభ్యులందరూ కలిసి చేస్తారు! చనిపోయినప్పుడు ఆత్మ ఎక్కడనుండి అయితే వెళ్ళిందో ఆ మరణించిన వాళ్ల ఆత్మ శాంతి కలగాలని వారియొక్క బంధువులతో కలిసి తండ్రికి తలకొరివి పెట్టిన పెద్ద కుమారులందరూ తద్దినం ఆచారాన్ని సక్రమంగా నిర్వహించాలి. ఆ పూజను చేయడానికి ఆచారున్ని పిలిపించి అందరూ కలిసి సంతోషంగా చేస్తారు.  తండ్రికి తలకొరివి పెట్టిన వాళ్ళు ఆ తండ్రికి పుట్టిన కుమారులతో కలిసి చేయకుండా వేరుగా చేసినట్టు అయితే ఆ తండ్రి ఆత్మకు శాంతి లేకుండా చేసినట్టు అవుతుంది. తలకొరివి పెట్టిన వాళ్ళు అలా చేయడం మహాపాపం. ఆ పాపం మరణించిన కానీ పోదు. తర తరాలుగా ఆ పాపం వెంట వస్తూనే ఉంటాయని పురాణాలు చెపుతున్నాయి. అన్నీ  కార్యక్రమాలు సక్రమంగా నిర్వహిస్తేనే తలకొరివి పెట్టాల్సి ఉంటుంది. అలా శ్రాద్ కర్మ వరకు విధానాన్ని పాటించాలి! సంవత్సరికం ప్రక్రియ యొక్క ఆచారాలు ఇతర శ్రాద్ధ వేడుకల మాదిరిగానే ఉంటాయి. మరణించిన ఆత్మకు శాంతి మరియు మోక్షాన్ని ప్రసాదించడానికి పూజలు నిర్...
అశాశ్వతమైన జీవితంలో  భోగ భాగ్యాలు కావాలనే ఆశ లేదు  కానీ ఈ శరీరంలో చలనం ఉన్నంతవరకు  ఈ దరణిపై కొన్ని విలువలతో జీవిస్తూ అందంగా పనిచేస్తూ కొందరికి కొన్ని విలువలను పరిచయం చేస్తూ జీవించడమే! జన్మించడం ఒక్క క్షణం మరణించడం ఒక్క క్షణం కానీ జీవించడం మాత్రం సులభమేమి కాదు అది నిరంతర సాధనలో ఉంటుంది! వ్యక్తిత్వం పైన అంటించుకున్న మరకలు ప్రాణం పోయినా కూడా పోవు అందుకే గొప్పగా జీవించాలి గడిచిన సమయం తిరిగిరాదు గడుస్తున్న కాలం ఎవరికోసం ఆగదు కాలం నిరంతర ప్రవాహం! జీవితం అంటే జన్మించడం మరణించడం మద్యలో ఉండే జీవించడమే కదా ఇదర్దం అయితే మనిషి మహర్షి అవుతాడు గొప్పగా ఆలోచిస్తాడు గొప్పగా ఆలోచిస్తూ గొప్పగా పనిచేస్తూ వ్యవస్థతో మమేకమై సంచరిస్తాడు! అవును  బతికేదెందుకు చాన్నాళ్లు మరణపు అంచులను తాకడానికి నిత్య నూతనంగా జీవిస్తూ  శాశ్వతమైన ఆలోచనలతో  బతికున్నప్పుడే జీవించి ఉండే పనులను చేస్తూ! Kallem Naveen Reddy 9963691692

బతికేదెందుకు చాన్నాళ్లు!

అశాశ్వతమైన జీవితంలో  భోగ భాగ్యాలు కావాలనే ఆశ లేదు  కానీ ఈ శరీరంలో చలనం ఉన్నంతవరకు  ఈ దరణిపై కొన్ని విలువలతో జీవిస్తూ అందంగా పనిచేస్తూ కొందరికి కొన్ని విలువలను పరిచయం చేస్తూ జీవించడమే! జన్మించడం ఒక్క క్షణం మరణించడం ఒక్క క్షణం కానీ జీవించడం మాత్రం సులభమేమి కాదు అది నిరంతర సాధనలో ఉంటుంది! వ్యక్తిత్వం పైన అంటించుకున్న మరకలు ప్రాణం పోయినా కూడా పోవు అందుకే గొప్పగా జీవించాలి గడిచిన సమయం తిరిగిరాదు గడుస్తున్న కాలం ఎవరికోసం ఆగదు కాలం నిరంతర ప్రవాహం! జీవితం అంటే జన్మించడం మరణించడం మద్యలో ఉండే జీవించడమే కదా ఇదర్దం అయితే మనిషి మహర్షి అవుతాడు గొప్పగా ఆలోచిస్తాడు గొప్పగా ఆలోచిస్తూ గొప్పగా పనిచేస్తూ వ్యవస్థతో మమేకమై సంచరిస్తాడు! అవును  బతికేదెందుకు చాన్నాళ్లు మరణపు అంచులను తాకడానికి నిత్య నూతనంగా జీవిస్తూ  శాశ్వతమైన ఆలోచనలతో  బతికున్నప్పుడే జీవించి ఉండే పనులను చేస్తూ! Kallem Naveen Reddy