Posts

Showing posts from November, 2023

బాపు దినకర్మ...!

Image
"పోయినొల్లందరు మంచోల్లు ఉన్నోల్లు పోయినొల్ల తీపిగుర్తులు" ఈ ఆదివారం (19-11-2023)  మా గ్రామంలో బాపు దినకర్మ! ____ ఒక్కోసారి  జీవితం శూన్యంగా కనిపిస్తుంది ఎన్నో ఆటుపోట్లను  ఎదుర్కుంటూ పోవాల్సిందే ప్రతి క్షణం ఏదో నేర్పిస్తూనే ఉంటుంది పోయినోల్లు ఇకరారు ఉన్నోళ్ళ కోసం జీవించాలి వాళ్ళకు బతుకునివ్వాలి ఇది ఒక బతుకు పాఠం నిత్యం అనేక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది! నది ప్రవాహం లెక్కనే కాల ప్రవాహం ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది..! గడిచిన కాలం తిరిగి రాదు ప్రవాహం వెనక్కి రాదు నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది..! మనం పుట్టక ముందు  ఈ భూమి మీద లేము మన మరణం తర్వాత ఈ భూమి మీద ఉండము..! కాబట్టీ అద్భుతంగా జీవిస్తూ ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎన్ని గడ్డు పరిస్ధితులు ఎదురైనా కాల చక్రంలో ప్రయాణించక తప్పదు! ఈ సృష్టిలో ప్రతిదీ గొప్ప సందేశాన్ని ఇస్తుంది! ఇక మనం ఉన్నన్ని రోజులు ఈ శరీరం మట్టిలో, గాలిలో కలిసేంత వరకు ఉన్నతంగా జీవించడానికి లక్ష్యం బాధ్యత మరవకూడదు ప్రయాణిస్తూనే ఉండాలి కాలం ఎప్పుడు ఏదో విధంగా  సమాధానమయ్యే ఉంటుంది..! 🙏🙏ఓం శాంతి బాపు🙏🙏 - Kallem Naveen Reddy

చివరి ప్రయాణంలో...!!

Image
జీవన ప్రయాణం కొంతవరకే ఆగిపోతుంది  మనదేది లేకుండా చేస్తూ మృత్యువు వెంట తీసుకెళ్తుంది నిన్న,నేడు,రేపు అనేది మన ఆధీనంలో ఉండదు అలాంటిది ఈ పుట్టుక మరణం ఎంత? కాలగర్భంలో కలిసిపోక తప్పదు జీవన గమనం గమ్యం తెలుసుకుని మృత్యువు అధరాన్ని తాకినప్పుడు జీవితం స్పష్టం అవుతుంది అలా తెలుసుకోలేనంత వరకు ఈ పుట్టుక వ్యర్థమే! కాలప్రవాహంలో గతించే కిందపడిపోయి చీకటయ్యే  గాలివాటు క్షణాల ముందు ఇదెంత బతుకు ఇదెంత బతుకు! ఏది లేదు ఏది రాదు నీకంటూ ఒక మృత్యువు ఉంది అదే నిజం అది నీడలా నీ వెంటే వస్తుంది నీకే తెలియకుండా అది సమీపిస్తుంది! కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కాలం చేతిలో అందరూ కీలుబొమ్మలే బతికే తీరు మాత్రమే నిజం  ఆ నిజంలోనే బతకాలి కాలం మనకంటే వేగం ఈరోజే కాదు  రేపు అనే భవిష్యత్ కూడా  కాలం అనే దోసిళ్ళ నుండి దొర్లిపోతుంది అస్పష్టంగా మనకే తెలియకుండా ఒలికిపోయిన మరకలను అంటించుకుని మరి వెళ్ళిపోతుంది! నీ కళ్ళల్లో నీళ్ళు తిరగడం కొన్ని జ్ఞాపకపు తునకలు మిగిలి కారిపోతున్న ఆ కన్నీళ్ళ సాక్షిగా ఈ ఒక్కరోజే కాదు సమాధి చేయబడని నీ భాధ నువ్వు బ్రతికున్నంత వరకు  నిన్ను బ్రతకనివ్వదు కానీ నువ్వు బ్రతికే ఉన్నావనే భ్...