ఆమె నా ప్రేమ....!!!
పెళ్ళి చేసుకున్నప్పుడు
మనం ఏం కావాలని,
ఏం చేయాలని అనుకుంటామో
అవి సమయానికి జరగవు
మనల్ని నమ్మి
నమ్మకంతో వచ్చినప్పుడు
ప్రేమ ఉంటేనే సరిపోదేమో అనిపిస్తుంది!
ఆ నమ్మకాన్ని చేరుకోవడానికి
నిత్యం యుద్ధం చేస్తూనే ఉన్నా....!
అనుకున్న అంచనాలను కూడా చేరుకోవాలి
జీవితం అంటే పూలపాన్పు కాదు
అలాగని అది ఎండమావి కూడా కాదు
సుఖము, దుఃఖము
రెండు కలగలిసి ఉంటాయి
అవును
జీవితం అంటే అన్నీ ఉంటాయి!
గొప్పగా ఆలోచనలు ఉన్నా
ఏం చేయలేకపోతున్న అనే భాద
నిత్యం వెంటాడుతూ ఉంటుంది!
నా హృదయమై
నా ఆలోచనల్లో భాగమై
నన్ను అర్దం చేసుకుంటూ
ఇబ్బంది పడుతున్న
ఏనాడు నన్ను ఇబ్బంది పెట్టలే!
ఆమెకు భూమికి ఉన్నంత ఓపిక
అన్నీ భరిస్తుంది
నన్ను నా ఆలోచనలను
ప్రేమిస్తూనే ఉంది!
అవును ప్రేమంటే
రెండక్షరాలే కాదు
రెండు హృదయాలు
ఒకే ఆత్మ....!!
(మాకు పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు)
❤️మీకు నా ప్రేమ❤️
Comments
Post a Comment