నిన్న,నేడు,రేపు అనేదే మన ఆధీనంలో లేదు అలాంటిది మన జీవితం ఎంత?
మనిషి పుట్టుక నుండి మరణం దాకా సాగే ప్రయాణమే జీవితం.
చూడగల్గితె ప్రతి జీవితం ఓ అద్భుతమే.
చదవగల్గితే ప్రతి జీవితం ఓ చరిత్రే.
✍️✍️✍️
కె.ఎన్.ఆర్
శ్రాధ్ కర్మ అనేది శ్రాధ్ కర్మ అనేది సంవత్సరికం విధానం , ఇది ఎంతో భాధ్యత గా చేసుకోవాల్సి ఉంటుంది. మాసికం, విమోకం మరియు పరమాత్మ అబ్దికం నవగ్రహ శాంతి పూజలు కుటుంబం లోని సభ్యులందరూ కలిసి చేస్తారు! చనిపోయినప్పుడు ఆత్మ ఎక్కడనుండి అయితే వెళ్ళిందో ఆ మరణించిన వాళ్ల ఆత్మ శాంతి కలగాలని వారియొక్క బంధువులతో కలిసి తండ్రికి తలకొరివి పెట్టిన పెద్ద కుమారులందరూ తద్దినం ఆచారాన్ని సక్రమంగా నిర్వహించాలి. ఆ పూజను చేయడానికి ఆచారున్ని పిలిపించి అందరూ కలిసి సంతోషంగా చేస్తారు. తండ్రికి తలకొరివి పెట్టిన వాళ్ళు ఆ తండ్రికి పుట్టిన కుమారులతో కలిసి చేయకుండా వేరుగా చేసినట్టు అయితే ఆ తండ్రి ఆత్మకు శాంతి లేకుండా చేసినట్టు అవుతుంది. తలకొరివి పెట్టిన వాళ్ళు అలా చేయడం మహాపాపం. ఆ పాపం మరణించిన కానీ పోదు. తర తరాలుగా ఆ పాపం వెంట వస్తూనే ఉంటాయని పురాణాలు చెపుతున్నాయి. అన్నీ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహిస్తేనే తలకొరివి పెట్టాల్సి ఉంటుంది. అలా శ్రాద్ కర్మ వరకు విధానాన్ని పాటించాలి! సంవత్సరికం ప్రక్రియ యొక్క ఆచారాలు ఇతర శ్రాద్ధ వేడుకల మాదిరిగానే ఉంటాయి. మరణించిన ఆత్మకు శాంతి మరియు మోక్షాన్ని ప్రసాదించడానికి పూజలు నిర్...
చరితకై తపన భావాల సంపదను పోగేసుకుని అక్షరమై జీవించాలని ఆరాటపడుతూ కాలంతో నా కలం పరిగెత్తుతుంది! తెల్లని పొలంలో నల్లని విత్తులేసుకుని మొలకెత్తించి చెడు వ్యక్తిత్వాలపై యుద్దం చేస్తుంది! సమాజంలో జరిగే ఆకృత్యాలపై నా అక్షరం ఒక విప్లవం నా అక్షరం ఒక కిరణం నా అక్షరం ఒక కెరటం గర్జించే నా గళమే ఆయుధం బాధాతప్త హృదయాలను స్పృశిస్తూ వ్యవస్థను ప్రశ్నించే కవిత్వం రాస్తూ కలానికి వ్యక్తిత్వాన్ని జోడించి నా వంతుగా కవిత్వం రాస్తా! నిగ్గదీసి నిజాలు చెప్పేందుకు కలం కాలంతో సాగేందుకు నాలోని మానవత్వాన్ని దారపోస్తాను! చరిత్ర పుటల్లో నిలవడానికి ప్రయత్నిస్తాను! నా బ్రతుకు కావ్యంలో హృదయాన్ని ఊయలలూగించే రచనలే చేస్తాను! ఒక్క సిరాచుక్క వికసించే వివేకమే కదా ఇదే నా వ్యక్తిత్వ సంపద నా జీవిత పుస్తకంలో చిరిగిన పేజిలేన్నో ప్రతి పేజీలో నేర్చుకున్నా విషయాలెన్నో! ఈ ప్రపంచం అంతా కూడా అన్నీ ఎవరికి తెలియని ఊర్లతో ఈ సమాజం నిండివుంది. అందులో ఏ మూలనో ఏ కొననో నీ ఉనికనేది! నీదనేది ఏది లేకుండా చేసే ఒకరోజు వచ్చినప్పుడు ఏది చేయకుండా నీపేరు ఇక్కడ లిఖించకుండా వెళ్తావో ఆ జన్మ నిరర్థకమే! బతుకంటే కేవలం బతకడమే కాదు జీవించడం కదా! చరిత్ర పుస్...
Comments
Post a Comment