పిట్టకెట్టుడు!
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgfgiv0KY3IhzlqTsRmthcDDVH3LlVRQW4nKEiMWGSLDCAZrn1kqSHEDlDgy3M-1qIKeTzCYpuN7VPAseG7OnX9CnIYIwZk6p3eL9QuWXNoniNaeWtPWDUuNDCqqtx8LopZG0ayVfm0cIc/s1600/1680168766084326-0.png)
అవును బలగం సినిమాలో తెలంగాణా ప్రాంతీయత మాత్రమే వుంది. మనిషి యొక్క ఉద్వేగాలను వున్నదున్నట్లు చూపడం ఈ సినిమా గొప్పదనం. ప్రేమని కేవలం మనుషుల చుట్టూరా తిప్పుతూ సహజంగా చూపడమే ఈ కథ చేసింది. ఇందులో ఎన్నో విలువలు ఉన్నాయి. కొన్ని సినిమాల్లో లాగా బూతు డైలాగులతో తాత్కాలిక మెప్పు కోసమో, సగం డ్రెస్సులు వేసుకుని అంగాంగా ప్రదర్శనలు చేసే సినిమాల్లో లాగా ఏ ఒక్క సీన్ లేని మనిషి బతుకు అంతరంగాన్ని పరిచిన తెలంగాణ పల్లె జీవన చిత్రం ఈ బలగం. ఇందులో సహజమైన తెలంగాణా గ్రామ జీవితం వుంది. సినిమా చూసిన తర్వాత మిగిలేవి మనుషుల మధ్య బంధాల ఆప్యాయతలు, ప్రేమలు మాత్రమే! ఏవి మనతో శాశ్వతంగా రాని ఆస్తుల కోసం,అహం కోసం,స్వార్థం కోసం ఒకే తల్లి కడుపులో పుట్టిన వాళ్ళ మధ్యలో ఈ కోప తాపాలు, మనస్పర్థలు అనేవి నీటి బుడగలతో సమానం. మరణం ముందు అందరూ ఓడిపోతారు కానీ ఇలాంటి ప్రేమల ముందు ఓడిపోకూడదు. ఇందులో ఆ కాకి నేర్పిన పాఠం చాలా గొప్పది. అందరూ కలిసి బంధం విలువ తెలుసుకుని ఒక్కటై బాధపడటం అందులో మనం గమనించవచ్చు. అప్పుడే కాకికి పెట్టింది ముడుతుంది. ఆ తాత ఆత్మ శాంతించి బంధాలు అనుబంధాలు ఆత్మీయతలు వికసించాయి. పుట్టిన ప్రతి మనిషి చనిపోతా...