ఆత్మయే జ్ఞానం - జ్ఞానమే ఆత్మ!

ఆత్మజ్ఞానం అంటే ఆత్మను తెలుసుకోవడమే
ఇక ఆత్మ అంటే మనమే
మనల్నీ మనం తెలుసుకోవడమే ఆత్మ జ్ఞానం!

ఈ ప్రశ్నల ఆంతర్యమే ఈ జీవితం....!

అసలు నేనెవరు?
ఎక్కడినుండి ఇక్కడికి వచ్చాను?
ఇక్కడ పుట్టడానికి ముందు ఎక్కడ ఉన్నాను?
ఇక్కడ మరణించాక ఎక్కడికి వెళ్తాను?
పుట్టడం మరణించడం ఏంటిది?
ఇక్కడ ఎప్పటికీ ఉండేదేంటి?
ఈ జీవించడం దేనికొరకు?
తినడం కొరకా?
తిరగడం కొరకా?
నిద్ర కొరకా?
ఈ జీవించడం మరి దేనికొరకు?

ప్రతి రోజు
ముందటి రోజులాగే గడిచిపోతుంది
రేపనే రోజు వస్తూనే ఉంటుంది
ఒక్క క్షణం కూడా ఆగదు
ఈ కాల ప్రవాహంలో
ఒకరోజు మరణంతో 
అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్లాల్సిందే
ఇదే నిజం
కాబట్టి ఈ నిజానికి భయం అవసరం లేదు!

ప్రతిరోజు తిన్నదే తింటున్నాం
తాగిందే తాగుతున్నాం
ఎక్కడికి పోయిన ఒకచోటకే వస్తున్నాం
నిద్రిస్తున్నాం
లేస్తున్నాం
ఇదంతా నిత్యం జరుగుతూనే ఉంటుంది!

ఇక్కడ పుట్టేదంతా ఇక్కడే నశిస్తుంది
ఈ దుఃఖం దేనికి?
ఈ ఆరాటం దేనికి?
ఆలోచిస్తుంటే ఈ ప్రయాణం 
ఒకరోజు చావడం దగ్గరికి కాకుండా ఇంకోచోటికి కాదు
ఈ జీవితమే మున్నాళ్ళ ముచ్చటే
దుష్ట తెలివితేటలతో ఎంత సంపాదించిన
మరణంతో అదంతా ఇక్కడే వదిలేయాల్సిందే
అయితే ఇక్కడే వదిలేయాల్సిన దానికోసం
అంతలా ఎందుకు ఆరాటపడుతున్నాము!

అవును 
ఒకరోజు అందరం
విగత జీవులై 
మౌనంగా స్మశానానికి ప్రయాణం కావాల్సిందే
ఈ మట్టికి తనువును ఇయ్యాల్సిందే
ఈ మాత్రానికే 
నేను, నాదే అనే స్వార్దం అవసరమా?
ఈ శరీరంలో ప్రాణం ఉన్నంతవరకు
వ్యవస్థలో మమేకమై 
గొప్ప భాధ్యత కలిగి సంచరిస్తూనే ఉండాలి
కొన్ని విలువలు నిత్యం పాటిస్తూనే ఉండాలి
జీవిత పరమార్ధాన్ని తెలుసుకోగలగాలి
ఇక గొప్ప లక్ష్యాలు,భావాలు కలిగిన వాళ్ళు
కచ్చితంగా గుర్తిస్తారు
గుర్తించడానికి అర్హత లేనివాళ్ళు 
కచ్చితంగా తాత్కాలికులై ఉంటారు
ఏదేమైనా ప్రయాణం గొప్ప మార్గాలలోనే!

అయోమయమైన ఈ నిజాలను
కాసేపు పక్కన పెట్టేస్తే
ఈ శరీరం పుట్టేటప్పుడు
ఈ శరీరం పెరిగేటప్పుడు
ఈ శరీరం పోయేటప్పుడు
ఏదైతే ఈ కాలంతో మార్పు లేకుండా 
ఈ శరీరంలో ఉందో
అదే ఆత్మ
అదే నువ్వు!

Somarampet
MA,M.Ed & Writer
సాహిత్య విభాగం కన్వీనర్ తెలంగాణ జాగృతి
కామారెడ్డి

Comments

Popular posts from this blog

తండ్రి సంవత్సరిక విధానం....!!

పుస్తకంలో నాకో పేజీ!