ఆత్మయే జ్ఞానం - జ్ఞానమే ఆత్మ!
ఆత్మజ్ఞానం అంటే ఆత్మను తెలుసుకోవడమే ఇక ఆత్మ అంటే మనమే మనల్నీ మనం తెలుసుకోవడమే ఆత్మ జ్ఞానం! ఈ ప్రశ్నల ఆంతర్యమే ఈ జీవితం....! అసలు నేనెవరు? ఎక్కడినుండి ఇక్కడికి వచ్చాను? ఇక్కడ పుట్టడానికి ముందు ఎక్కడ ఉన్నాను? ఇక్కడ మరణించాక ఎక్కడికి వెళ్తాను? పుట్టడం మరణించడం ఏంటిది? ఇక్కడ ఎప్పటికీ ఉండేదేంటి? ఈ జీవించడం దేనికొరకు? తినడం కొరకా? తిరగడం కొరకా? నిద్ర కొరకా? ఈ జీవించడం మరి దేనికొరకు? ప్రతి రోజు ముందటి రోజులాగే గడిచిపోతుంది రేపనే రోజు వస్తూనే ఉంటుంది ఒక్క క్షణం కూడా ఆగదు ఈ కాల ప్రవాహంలో ఒకరోజు మరణంతో అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్లాల్సిందే ఇదే నిజం కాబట్టి ఈ నిజానికి భయం అవసరం లేదు! ప్రతిరోజు తిన్నదే తింటున్నాం తాగిందే తాగుతున్నాం ఎక్కడికి పోయిన ఒకచోటకే వస్తున్నాం నిద్రిస్తున్నాం లేస్తున్నాం ఇదంతా నిత్యం జరుగుతూనే ఉంటుంది! ఇక్కడ పుట్టేదంతా ఇక్కడే నశిస్తుంది ఈ దుఃఖం దేనికి? ఈ ఆరాటం దేనికి? ఆలోచిస్తుంటే ఈ ప్రయాణం ఒకరోజు చావడం దగ్గరికి కాకుండా ఇంకోచోటికి కాదు ఈ జీవితమే మున్నాళ్ళ ముచ్చటే దుష్ట తెలివితేటలతో ఎంత సంపాదించిన మరణంతో అదంతా ఇక్కడే వదిలేయాల్సిందే అయితే ఇక్కడే వదిలేయాల్సిన దానికోసం అ...