కన్యాకుమారిలో రాత్రి!

సూర్యుడు తీసుకొచ్చే ఉదయం కోసం
నేను రాత్రిని అక్కడే ఉండి అనుభవించాను
చీకటి, నిద్ర గుండా
నిశబ్దంగా గుడి గంటలు
శబ్దమై హాయిగా తీరాన్ని డిగొట్టే 
సముద్రపు అలలు
హిందూ మహాసముద్రం,
బంగాళ ఖాతం,
అరేబియా సముద్రం 
పైన ఆకాశం
ఈ మూడు సముద్రాలపై
అనేకనేక రంగులు వేస్తాడని
సముద్రం పక్కనే పడుకుని
నేను ఉదయం కోసం చూస్తూనే ఉన్నాను
అవును
ఇంత అందమైన దృశ్యం ఏది లేదు అనుకుంటా
ఇక కన్యాకుమారి నుండి 
మా తిరుగు ప్రయాణం ప్రారంభం కాబోతుంది!

Comments

Popular posts from this blog

తండ్రి సంవత్సరిక విధానం....!!

పుస్తకంలో నాకో పేజీ!