నీ దారిలో భాద్యతగా సాగుతూపో...!

ఇంత విశాలమైన ప్రపంచంలో
మనం కేవలం అణువులము మాత్రమే
మన ఆలోచనలు కేవలం విశ్వవ్యాప్తమవ్వాలి కానీ
నలుగురి చుట్టే నాట్యమాడకూడదు
నువ్వు కోయిల గురించి గార్ధభ గాత్రంతో దరువేస్తే
గోడలకు కూడా చెవులుంటాయి
కొన్ని సార్లు మనకు నేరుగానే వినిపిస్తాయి
నీకు నీవుగా స్వచ్ఛందంగా ఏ పని చేసినా 
ఎవరో ఒకరు రాళ్లు విసురుతూనే ఉంటారు 
వాటితో నీ చుట్టూ ఒక గోడ కట్టుకోవచ్చు 
లేదా వాటన్నింటినీ మీ గెలుపుకు బాటగానూ పరుచుకోవచ్చు
నిర్ణయం మన చేతుల్లోనే ఉంది
ఏం చేయడానికి చేతకాని శునకాలే మోరుగుతాయి
వ్యవస్థను నా వంతుగా
ఆ "యోధున్ని" నా హృదయంలో కొలుస్తూ 
భాద్యతగా కదిలించే అక్షరాలతో నా ప్రయాణం కొనసాగుతుంది
నా ఆయుధం కలం
నీ ఆయుధం చూడలేక వ్యంగ్యమై మాట్లాడటం
నా ఆయుధానికే పదును ఎక్కువగా ఉంటుంది
నీ ఆయుధం తాత్కాలికం
నా ఆయుధం మరణానంతరం శాశ్వతమై ఉంటుంది
నీ ఆయుధం వర్షంలో చల్లారే మంటల మాదిరే
నా ఆయుధం వర్షంలో సైతం మండిస్తుంది
అవసరమైతే మాట్లాడు 
లేదంటే నిశ్శబ్దంగా ఉండు 
ఒకరోజు శబ్దమై నాలుగు వీధుల్లో నేనుంటాను
వాడిని వీడిని తక్కువ చేసి మాట్లాడుతూ 
నాలుగు గోడల్లోనే నిశబ్దమై నువ్వుంటావు
సాధ్యమైనంత వరకు 
సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన 
చూడలేక చెడుగా మాట్లాడుకోవద్దు
ఎందుకంటే
ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరిగితే 
నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి!
వ్యవస్థలో మమేకమై పనిచేసే వాడి మీద 
రాళ్ళు విసిరే అజ్ఞానులు 
ఇంకా వెలగడం లేదు
జ్ఞాన జ్యోతులు ఆర్పేస్తూ...!
నిజమే మనిషిలా బతకలేని వారంతా 
ఒకచోట చేరుతారు!
అలా తెరచాటున మాటల తూటాలు 
విసురుదామని చూస్తున్నారేమో
ఇనుపకవచం కన్నా జఠిలమైనది 
నా మనోబలం
వెనుతిరిగి నేలరాలాల్సిందే 
మీ సమయం
నేను పెదవి విప్పనంతవరకే
నీ ప్రస్థానమిక్కడ
కథలల్లి కాలక్షేపం చేస్తున్నారేమో
రవ్వంతైనా నా మోమున 
చిరునవ్వును చెరపలేదు 
మీ ప్రతిఫలం
నా ప్రపంచం నిత్యవాసంతపు విరివనం
నిత్యం ఎన్నో పదాల మాలలల్లుకుంటాను
ఆ పరిమళాలను ఆఘ్రాణిస్తూ 
పరవశమౌతాను
నా నిత్యజీవనం సమస్యల వెంట పయనం
అలల ఊయలపై కదలాడే 
ఆశల సరాగం
ఇక నా గమ్యం
మీరు సాగించలేని పయనం
మీరు ఎన్నటికీ చేరలేని తీరం!
కాంతులను విరజిమ్మే తారజువ్వై
ఈ అందమైన ప్రపంచంలో 
ప్రయాణిస్తూ విహరిస్తూ 
ముందుకు సాగడమే ఉన్నతుల విధానం!

(కొందరు గోతికాడ నక్కలు కుక్కలు కలిసి తినిపాడేసిన బొక్కలు కొరుకుతూ మాట్లాడిన వాళ్ళ కోసం. నేను నిజాలను రాస్తే ఆ రోజుకే నీ ప్రస్థానం ముగుస్తుందని మరవకు. కొందరి జాధ్యాందులకు ఇకనైనా కనువిప్పు కలుగుతుందని అనుకుంటూ భాద్యతగా వ్యవస్థను కదిలించే పనులనే చేస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో మనయొక్క పాత్ర గొప్పగా ఉండాలని కోరుకుంటూ సెలవు)

Comments

Popular posts from this blog

తండ్రి సంవత్సరిక విధానం....!!

పుస్తకంలో నాకో పేజీ!