దేహం!
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjBS2qazbTNkxOAPDNf8AgeOeL5UiH-COfdiekhg3X5btsBT9Lf9OplOzb8spqIA90HZlW8L16ehpeIfkmUUfrgFZlkkUMECl5viWS9o1C0K4z6O11kWh4c0xi-GqPGojvK9LuptymYo5E/s1600/1672325956707934-0.png)
ఒకరోజు ఈ దేహాలన్నీ ఊరు చివరన చేరబడతాయి ఈ పలికే మాటలన్నీ ఒకరోజు మూగబోతాయి నీదని నాదని విర్రవీగి బతికిన దేహాలు దాహానికి దూరం అవుతాయి అవును ఇక్కడెన్నో దేహాలు పాతిపెట్టబడ్డాయి చరిత్ర పుటల్లో దాగిన సత్యాలను చూపిస్తూ....! అశాశ్వతమైన ఈ జీవన కాలగమనంలో అస్పష్టంగా ఒకరోజు అన్నీ అక్కడే ఊరిచివరన తలదాచుకుంటాయి! అర్థరహిత ఉనికిది ఈ దేహం దానికి నిర్వచనాలతో పనేముంది? శ్వాసనిశ్వాసలు విఛ్ఛిన్నమౌతూ ప్రాణం నీ నుండి దూరం అవుతున్న సమయంలో నీ ఆత్మకు సమాధి నీ దేహం మాత్రమే అలాంటిది ఆ దేహానికి నిర్వచనాలతో పనేముంది? మనసనే ఒక ఉద్వేగాన్ని అర్దం చేసుకోక ఆప్యాయతల, అనురాగాలను తుడిపేసి ఇంత కాలాన్నీ గడిపావు కదా నీ ఆలోచనలకు జీవిత ఆంతర్యం ఏంటో అర్దం కాలేదా? ఈ కనిపిస్తున్న దేహం ఒకరోజు కనుమరుగవుతుందని తెలియలేదా? Kallem Naveen Reddy