మౌనం!
బతకడం వేరే
జీవించడం వేరే
బతికేవాల్లకు నేనర్దం కాను
జీవించేవాల్లకు మాత్రమే అవుతా!
ఇదర్దం కానీ వారిమధ్య
అప్పుడప్పుడు
మౌనం వహిస్తూ
అక్షరాలతో స్నేహం చేస్తూ
అర్ధమయ్యే వారికి అర్థమవుతూ
కానివారికి కాకుండా
నేనిలా నాదైన దారిలో
మట్టి శిల కావడానికి ఎన్ని యుగాలో
కానీ
హృదయం రాయిగా మారడానికి
ఒక్క మౌనం చాలు కదా
ఎన్నో ఆటుపోట్లు
ఎన్నో నమ్మకద్రోహాలు
మౌనానికి నిదర్శనం అయినప్పుడు
ఆ మౌనం కచ్చితంగా
కొన్ని విస్పోటనాలను
కొన్ని యుద్ధాలను చేయగలదు!
కచ్చితంగా ఒకానొక రోజు
తక్కువ ఎక్కువ కాగలదు
ఎక్కువ తక్కువ కాగలదు
ఈ ఎగిసి పాటు
ఆ మిడిసి పాటు
కలకాలం కాదనేది వాస్తవం!
కళ్లెం నవీన్ రెడ్డి
అభ్యుదయ కవి
Comments
Post a Comment