బాల్యానికి విలువలు నేర్పించాలి!
అవును బాల్యానికి రెక్కలతో పాటు
విలువలు నేర్పించాలి
అప్పుడే ఇలాంటివి జరగకుండా ఉంటాయి!
నేటి యువత మంచికి ఆకర్షితం అయ్యేకంటే చెడుకే అవుతుంది
ఎందుకు
ఎప్పుడైనా మీ మనస్సు మంచివైపు కేంద్రీకరించారా!
భవిష్యత్ బాల్యాన్ని కలగంటేనే భయం అవుతుంది....
అడుగడుగున కామాంధుల కళ్ళు,
లేదింక బాలలకు, మహిళలకు రక్షణ,
అమలు చేయాల్సిన శిక్షలు కటినంగా ఉండాలి.
వారి ఆత్మ నా మాటల్లో..............!
నేనునీచేతుల్లో నలిగిపోలేదు
నీచూపుల్లో,
నీమాటలతో,
నీచేష్టలతో
నీ కామందా కళ్ళల్లోపడి,
ఎప్పుడో నలిగిపోయాను,
కృంగిపోయాను.
మట్టిలో కలిసిపోయే ఈ జీవితాలు క్షణిక పాటు ఆలోచనలతో చేస్తున్న ఆకృత్యాలకు
చెప్పే సమాధానం
ఇంకో చర్య జరగాలంటే భయంగా ఉండాలి.......
ఇప్పుడు నువ్వు ఆనందించింది,
అనుభవించింది....
నా మాంసపు ముద్దను మాత్రమే!
ఏమో మళ్ళి నీ కామం నుండే పుడతానేమో అప్పుడు కూడా వాయివరసలు మరచి నన్ను చిదిమేయ్......
రాక్షస జనావాసాల మధ్య బలి అవుతున్న దేశ భవిష్యత్ లు ఎందరో!
మంచిని మంచి అని చెప్పలేని అందరూ కూడా ఇదే కోవలోకి వస్తారు!
ఎందుకంటే చిన్నప్పటి నుండే విలువలు నేర్పించాలి
మనమధ్య చెడు దారిలో తిరుగుతున్న యువతకు మంచి,చెడుల మధ్య భేదం తెలపాలి!
గొప్పగా జీవించే వ్యక్తిత్వం నేర్పిస్తే చాలు!
ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలకు అందరూ చూస్తుండగానే ఎన్ కౌంటర్ చేయాలి!
నవీన్ రెడ్డి
అభ్యుదయ కవి
Comments
Post a Comment