కొంతకాలమే!


ఇసుమంతైనా నగుమోము
నా నుండి దూరం చేయలేరు
తెలుసుకో
కొంతకాలమే ఇక్కడ
గొప్పగా బతుకు
గొప్పగా చావు అంతే
శరీరానికే మరణం
ఆశయాలకు
ఆలోచనలకు కాదు
కట్టోలే కాలునురా మనిషి
చివరికి మిగిలేది ఎంటి
నీది
నాది
ఏదిలేదు ఇక్కడ!
ఉన్నదంతా ఒక్కటే
మంచి,చెడు
ఇదే తెలుసుకోవేమిర!
బంధాలను భాద పెడుతూ
సాధించేది ఏమీలేదు ఇక్కడ
కాటికి
రేపు నేను
ఆ తర్వాత నువ్వు
అంతే కదా!
భవిష్యత్ కాల గమనంలో
అందరూ కొట్టుకుపోవాల్సిందే
ఒకె ఆకాశం కింద ఉన్నోల్లం
ఒకె మట్టిని కప్పుకుపోయే వాళ్ళం
ఏదిలేదు
ఏదిరాదు
పేరొక్కటే శాశ్వతం
తెలుసుకో
తలెత్తి జీవించు
నమస్కరించేలా.....!

నవీన్ రెడ్డి
అభ్యుదయ కవి
సాహిత్య విభాగ కో కన్వీనర్ తెలంగాణ జాగృతి
కామారెడ్డి జిల్లా
9963691692

Comments

Popular posts from this blog

తండ్రి సంవత్సరిక విధానం....!!

పుస్తకంలో నాకో పేజీ!