మా అమ్మ చదువుకోని ఓ గొప్ప పుస్తకం

మా అమ్మ సులోచన(రాజవ్వ) చదువుకోని ఓ గొప్ప పుస్తకం!
===========================
మా అమ్మ చదువుకోని ఓ గొప్ప పుస్తకం!
జీవితమంతా ఎన్నో జ్ఞాపకాలతో బతుకు పాఠం అయింది
బతుకు విలువ తెలిపింది
అమ్మ ఆజ్ఞతో పెరిగాము
కోట్లు ఇవ్వలే
మిద్దెలు మేడలు ఇవ్వలే
కానీ వాటికంటే గొప్పవే ఇచ్చింది!
పట్టించుకోని నాన్నతో
కేవలం మేం పుట్టామని
జీవితం అంతా నాన్నతో ఓ యుద్దం చేస్తూ
అర్దం చేసుకోని బంధాల నడుమ 
బాధలను దిగమింగి
జీవితం అంటే ఎంటో నేర్పింది!
గొప్ప వ్యక్తిత్వానికి అవసరం అయిన విద్యను ఇచ్చింది!
అయినా
మా అమ్మ చదువుకోని ఓ గొప్ప పుస్తకం!
ప్రతి పేజీ అందంగా నిర్మించుకుని
రక్తబంధాల నడుమ మాటకి నిలిచి
కొన్ని సందర్భాల్లో అమ్మ హృదయం ఆగమైంది
తోడబుట్టిన వాళ్ళ వళ్లనో
ఇంకా తోడబుట్టని వాళ్ళతోనో
ఆగం అయితే అయ్యింది
బతుకు పాఠం నేర్పింది కదా
నేను బరోసా అయ్యాను
బాధను దింపాను
నేనున్నా అన్నాను
మనుషుల హృదయాలను చదివాను
మారు మనిషి వేషాలను కనిపెట్టాను
జీవితం అర్దం అయింది
అంతరంగ సంఘర్షణల తో
బాధాతప్త హృదయంతో 
మనస్సు పడిన వేదన ముందు
నిజమైన ప్రేమ,ఆప్యాయతలు తెలిశాయి!
అన్ని అబద్ధపు ప్రేమలు డబ్బుతోనే ముడిపడివున్నాయి!
మనమైతే శాశ్వతం కాదు కదా
ఇప్పుడున్న స్థితి కాదు కదా
అమ్మ అంటుండేది
మనం ఎప్పుడు మనలాగే ఉండాలని
అవును మేం అలాగే ఉన్నాము
మారకుండా!
బుడి బుడి అడుగులు వేసేటప్పుడు అమ్మలో ఏ ప్రేమైతే చూసానో
ఇప్పుడదే చూస్తున్నాను
అమ్మంటే అదే కదా మరి
నిర్మలమైన ప్రేమ 
కల్మషం లేని ప్రేమ అంటే అమ్మనే!
అమ్మా
నీ ప్రేమ గురించి చెప్పాలంటే
ఈ భాష
ఈ కవిత్వం 
ఈ సాహిత్యం
ఇవేవీ సరిపోవు
అవును
ఇవేవీ సరిపోవు!

Note:-
(ఒక్కరోజే కాదు మాతృ దినోత్సవం
రోజూ మాతృ దినోత్సవమే)

కళ్లెం నవీన్ రెడ్డి
అభ్యుదయ కవి
సోమారం పేట్
తెలంగాణ జాగృతి సాహిత్య విభాగ కో కన్వీనర్ కామారెడ్డి జిల్లా
9963691692

Comments

Post a Comment

Popular posts from this blog

తండ్రి సంవత్సరిక విధానం....!!

పుస్తకంలో నాకో పేజీ!