భూమి నవ్విందట!

అవును 
భూమి నవ్విందట
నాకోసం వాదులాడిన వారు
వాదులాడని వారు
అందరూ 
నాలోనే కలిసిపోయారని!
ఇదర్థం కాక
స్వల్పంగా జీవిస్తున్నారు!
మళ్లీ చెపుతున్నా
ఏది శాశ్వతం కాదు
శాశ్వతం అంటే కేవలం 
పేరు మాత్రమే!
మంచి, చెడులను
వ్యక్తిత్వమే నిర్ణయిస్తుంది
జీవితం ఆంతర్యం ఎంటో తెలుసుకోకుండా
మోసం చేస్తూ మోసపోతూ
వెలిగిపోతున్నా 
అనే భ్రమలో బతుకుతున్నారు!
అందుకే భూమి నవ్విందట 
ఇప్పుడైనా పుట్టుకకు గల కారణం ఏంటో తెలుసుకుంటారని!
అర్ధం అయిన వారిని
కాలగర్భంలో కలిసిపోకుండా
తనతో పాటు ఉంచేసుకుంది!
ఇక అర్థం కానివారిని
భూమి భారాన్ని మోయలేక వదిలేసుకుంది!
ఏవేవో కట్టుకతలతో 
జీవితం సాగదీస్తున్నాను అనుకుంటే పొరపాటే
శరీరం మరణం పొందే వరకే నీ ఉనికి ఇక్కడ!
మరణం వ్యక్తిత్వానికి కాకుండా చూసుకో! 
చరిత్ర పుటల్లో నీకో పేజీ లేకపోతే
ఇలా బతికితే బతుకే కాదని
భూమి తన భారాన్ని మరియు బాధ్యతను
ఇలా గుర్తుచేస్తూ
మల్లొక్కసారి భూమి నవ్వింది!
=============================
కె.ఎన్.ఆర్
అభ్యుదయ కవి
9963691692
=============================

Comments

Popular posts from this blog

తండ్రి సంవత్సరిక విధానం....!!

పుస్తకంలో నాకో పేజీ!