Posts

Showing posts from May, 2021

భూమి నవ్విందట!

Image
అవును  భూమి నవ్విందట నాకోసం వాదులాడిన వారు వాదులాడని వారు అందరూ  నాలోనే కలిసిపోయారని! ఇదర్థం కాక స్వల్పంగా జీవిస్తున్నారు! మళ్లీ చెపుతున్నా ఏది శాశ్వతం కాదు శాశ్వతం అంటే కేవలం  పేరు మాత్రమే! మంచి, చెడులను వ్యక్తిత్వమే నిర్ణయిస్తుంది జీవితం ఆంతర్యం ఎంటో తెలుసుకోకుండా మోసం చేస్తూ మోసపోతూ వెలిగిపోతున్నా  అనే భ్రమలో బతుకుతున్నారు! అందుకే భూమి నవ్విందట  ఇప్పుడైనా పుట్టుకకు గల కారణం ఏంటో తెలుసుకుంటారని! అర్ధం అయిన వారిని కాలగర్భంలో కలిసిపోకుండా తనతో పాటు ఉంచేసుకుంది! ఇక అర్థం కానివారిని భూమి భారాన్ని మోయలేక వదిలేసుకుంది! ఏవేవో కట్టుకతలతో  జీవితం సాగదీస్తున్నాను అనుకుంటే పొరపాటే శరీరం మరణం పొందే వరకే నీ ఉనికి ఇక్కడ! మరణం వ్యక్తిత్వానికి కాకుండా చూసుకో!  చరిత్ర పుటల్లో నీకో పేజీ లేకపోతే ఇలా బతికితే బతుకే కాదని భూమి తన భారాన్ని మరియు బాధ్యతను ఇలా గుర్తుచేస్తూ మల్లొక్కసారి భూమి నవ్వింది! ============================= కె.ఎన్.ఆర్ అభ్యుదయ కవి 9963691692 =============================

మా అమ్మ చదువుకోని ఓ గొప్ప పుస్తకం

మా అమ్మ సులోచన(రాజవ్వ) చదువుకోని ఓ గొప్ప పుస్తకం! =========================== మా అమ్మ చదువుకోని ఓ గొప్ప పుస్తకం! జీవితమంతా ఎన్నో జ్ఞాపకాలతో బతుకు పాఠం అయింది బతుకు విలువ తెలిపింది అమ్మ ఆజ్ఞతో పెరిగాము కోట్లు ఇవ్వలే మిద్దెలు మేడలు ఇవ్వలే కానీ వాటికంటే గొప్పవే ఇచ్చింది! పట్టించుకోని నాన్నతో కేవలం మేం పుట్టామని జీవితం అంతా నాన్నతో ఓ యుద్దం చేస్తూ అర్దం చేసుకోని బంధాల నడుమ  బాధలను దిగమింగి జీవితం అంటే ఎంటో నేర్పింది! గొప్ప వ్యక్తిత్వానికి అవసరం అయిన విద్యను ఇచ్చింది! అయినా మా అమ్మ చదువుకోని ఓ గొప్ప పుస్తకం! ప్రతి పేజీ అందంగా నిర్మించుకుని రక్తబంధాల నడుమ మాటకి నిలిచి కొన్ని సందర్భాల్లో అమ్మ హృదయం ఆగమైంది తోడబుట్టిన వాళ్ళ వళ్లనో ఇంకా తోడబుట్టని వాళ్ళతోనో ఆగం అయితే అయ్యింది బతుకు పాఠం నేర్పింది కదా నేను బరోసా అయ్యాను బాధను దింపాను నేనున్నా అన్నాను మనుషుల హృదయాలను చదివాను మారు మనిషి వేషాలను కనిపెట్టాను జీవితం అర్దం అయింది అంతరంగ సంఘర్షణల తో బాధాతప్త హృదయంతో  మనస్సు పడిన వేదన ముందు నిజమైన ప్రేమ,ఆప్యాయతలు తెలిశాయి! అన్ని అబద్ధపు ప్రేమలు డబ్బుతోనే ముడిపడివున్నాయి! మనమైతే శాశ్వతం కాదు కదా...

ప్రేమంటే

Image
ప్రేమంటే రెండు ఆత్మల అంతరంగ భావాల భాష! కె.ఎన్.ఆర్