స్త్రీ
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భముగా
స్త్రీ అంటే కేవలం పురుషుడి కోసమే కాదు
స్త్రీకి ఉద్వేగాలుంటాయి
అలాగే ప్రతిస్పందనలుంటాయి
కేవలం పురుషున్ని ప్రేమించడానికి,
సేవించడానికి,
బాధలు పడటానికి మాత్రమే ఆమె జన్మించలేదు.
మాతృత్వ నిర్వహణ అనేది స్త్రీకి ఒక గొప్ప భాద్యత
దీన్ని వారు ఆనందంగా స్వీకరిస్తారు.
స్త్రీ అంటే ప్రకృతికి ప్రతీక.
ఆమెలోని మూలదాతువు మాతృత్వం.
అదే లేకపోతే పురుషుడికి ఉనికే లేదు.
పువ్వు ప్రకృతిని ఒడిలోకి చేర్చుకుని వికసిస్తుంది
కానీ విచ్చుకత్తుల బలవంతతతో కాదు
అందుకే దేనికైనా ఒక అర్ధం ఉంటుంది.
లేలేత కిరణాలకు పువ్వు విచ్చుకుంటుంది.
ఇంట్లో స్త్రీ ఉంటే ఆ ఇల్లు ఓ నందనవనంలా
ఓ పూజ మందిరంలా ఉంటుంది.
పవిత్రమైపోతుంది.
ప్రేమ,త్యాగం, వాత్సల్యం, సేవ అంటూ దొరకనిది ఏది ఉండదు.
ఆమె అందురాలై ఉండవచ్చు,
వికరాంగురాలై ఉండవచ్చు,
మరే విధంగానైనా ఉండవచ్చు,
కానీ స్త్రీకి జీవన ప్రాంగణంలో ఉన్న ఉనికే వేరు.
ప్రేమ నిండిన ఆ చేతులు
త్యాగం తో తడిసిన ఆ చేతులు
తనకోసమే కాదు,
తన కుటుంబం కోసం
ఇంకా తనది కానీ ఈ ప్రపంచం కోసం కూడా!
స్త్రీకి చేతకాదా
స్త్రీ ఏమి చేయలేదా
బలహీనురాలేనా అంటే కచ్చితంగా తప్పే!
స్త్రీ అనుకుంటే గాడ్రించి పైకస్తున్న సింహాన్ని కూడా ఎదుర్కోగలదు....!
కానీ అలా చేయలేదు.
ఎందుకంటే స్త్రీ అలా కోరుకోలేదు.
కేవలం ఈ పురుష సమాజం నుండి ప్రేమను మాత్రమే కోరుకున్నది.
అందుకే నా అభిప్రాయంలో స్త్రీ అంటే ఒక దేవత.
తనది కాని ఈ ప్రపంచాన్ని కూడా హక్కున చేర్చుకునే మాతృమూర్తి స్త్రీ!
ఓ పక్క ప్రాలూతాగుతూ తన మంగళ సూత్రం లాగేందుకు చిన్ని చిన్ని పాదాలతో గుండెల మీద తన్నేందుకు ప్రయత్నిస్తున్న పసిబిడ్డే దీనికి నిదర్శనం!
మాతృత్వ నిర్వహణ స్త్రీకి మాత్రమే సొంతం!
కళ్లెం నవీన్ రెడ్డి
అభ్యుదయ కవి
తెలంగాణ జాగృతి సాహిత్య విభాగ కో కన్వీనర్ కామారెడ్డి జిల్లా
9963691692
Comments
Post a Comment