నేను కవితలై జీవిస్తాను✍️

✍️కె.ఎన్.ఆర్✍️


నేను కవితలై జీవిస్తాను
కవితల్లోనే మరణిస్తాను
అక్షరాలను సమకూర్చి
మాలలు మాలలుగా అల్లుకుంటాను
కొన్ని మనసులని హత్తుకుంటాను
ఉదయాన్నే వికసించిన పుష్పంలా
నా మదిలో వికసించి
నా హృదయాన్ని కదిలించి
నాతోనే జీవిస్తున్న అక్షరానికి నే నేస్తాన్నై
సాగుతున్నాను
ఇదే నా జీవితం
ఇదే నా వ్యక్తిత్వం
నిన్నంటే  జ్ఞాపకం!
నేడంటే  వాస్తవం!
రేపంటే  స్వప్నం!
ఇంతేగా ఈ జీవితం
అందుకే చావులేని అక్షరాలతో బతుకుదామని
బతుకుతున్నాను
కలంలో
హృదయభావాన్ని  నింపితే 
జాలువారే  ప్రతి అక్షరం 
కూడా అద్భుతమే
ఓ ప్రస్తానమే

✍️కె.ఎన్.ఆర్✍️
✍️నవీన్ రెడ్డి✍️
✍️9963691692✍️

Comments

Popular posts from this blog

తండ్రి సంవత్సరిక విధానం....!!

పుస్తకంలో నాకో పేజీ!