కవిత్వం అంటే
![]() |
కె.ఎన్.ఆర్ |
**********************************
కవిత్వం అంటే మార్గం
కవిత్వం అంటే సృజనాత్మకత
కవిత్వం అంటే నిగూడత
కవిత్వం అంటే మనసును హత్తుకునేది
కవిత్వం అంటే నిరంతర సాధన
కవిత్వం అంటే అన్వేషణ
కవిత్వం అంటే అక్షరాల నడక ప్రయాణం
కవిత్వం అంటే ఓ వేదన
కవిత్వం అంటే కీర్తి కాంక్ష లేనిది
కవిత్వం అంటే మనసును కదిలించేది
కవిత్వం అంటే మేల్కొలిపేది
కవిత్వం అంటే అనుభూతి
కవిత్వం అంటే అనుభవం
కవిత్వం అంటే లక్షణం
కవిత్వం అంటే సజీవం
కవిత్వం అంటే కావ్యం
కవిత్వం అంటే ఆలోచన
కవిత్వం అంటే ఆకలి
కవిత్వం అంటే అక్షరాల ఆయుధాలు
కవిత్వం అంటే శబ్దం
కవిత్వం అంటే నిశబ్దం
కవిత్వం అంటే విప్లవం
కవిత్వం అంటే భావం
కవిత్వం అంటే తీరని దాహం
కవిత్వం అంటే బతుకు
కవిత్వం అంటే అనంతం
కవిత్వం అంటే చెడు పై అస్రం
కవిత్వం అంటే మంచి
కవిత్వం అంటే ఓటమి మీద గెలుపు
కవిత్వం అంటే కవి యొక్క తత్వం
కవి కాకులకు అర్దం కాడు
కాకిని కూడా కోయిల ను చేసే అక్షరాలే కవి సొంతం
జీవితానుభవాన్ని ప్రత్యక్షంగా, సజీవంగా అనుభూతికి అందివ్వటమే కవిత్వం ధ్యేయం. అసంబద్ధమైన వాటిమధ్య సంబంధమే కవిత్వానికి అర్ధం చేకూరుస్తుంది.ఈ సంబంధమే కవిత్వ సారమూ, అది ప్రసరించే కాంతి.కవిత్వాన్ని ప్రసరింప చేయువాడు కవి.
**********************************
కె.ఎన్.ఆర్
**********************************
Comments
Post a Comment