నేటి పెద్ద మనిషి పంచాయితీలు
నాలుక అబ్బో నాలుక ఎన్ని వంకర్లు తిరుగుతుందో ఎన్ని చీలికలు సాగుతుందో ఎన్ని మడతలు పడుతుందో ఎంత విషం చిమ్ముతుందో పచ్చనోటుకోసం పామవుతుంది. పోస్తే పోయె మందు కోసం ఏవేవో రాజకీయాలు పాము పబ్లిగ్గా తిరుగుతుంటే కర్రెత్తుకురాబొయాను మధ్యలో పెద్దమనుషులడ్డుపడి గడ్డపలుగులు తెస్తామన్నారు ఇంతలో అది తప్పించుకెళ్ళిపోయింది కాదు తప్పించుకునేట్టు చేశారు ఇల్లు తగలబడి పోతే నీరుకి బదులు కిరోసిన్ పోసి నీరనుకున్న అని అంటున్నారు అవును పంచాయితీలు అలాగే చేస్తున్నారు "కొండీలు" పెడుతున్నారు నీ దారిలో నువ్వు నడిచినా ఎన్నో రాళ్ళు రువ్వుతున్నారు పగలబడి నవ్వుతున్నారు కానీ కాలం అన్నింటికీ సమాధానం కదా దీన్ని మరుస్తున్నారు కల్లబొల్లి కథలు చెప్పి కాకిని కూడా కోయిలను చేస్తున్నారు తప్పుని తప్పు అనలేని వాడు కాదు కదా పెద్ద మనిషి! ఒప్పుని కూడా తప్పు చేసే వాళ్ళే చుట్టూ చేరి ఎన్నో తిమ్మిరి బమ్మిరి మాటలు తలతిక్క వేషాలు మరిచిపోకు ఇక్కడ నీ పేరే శాశ్వతం ఇంకేమి కాదు వీలైతే నిజాయితీగా మాట్లాడండి పేరుని తరాలు గుర్తుపెట్టుకునేలా ===================== కొందర్ని చూసాక రాసింది ఇది =====================